Advertisement
ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు.. చాలా మంది ఆడియన్స్ ముందు దాని రివ్యూ చూడాలని అనుకుంటారు. ఈ రివ్యూ ల సంప్రదాయం చాలా కాలం నుంచే వుంది. అయితే.. కొన్ని సార్లు రివ్యూల సంగతి పక్కన పెట్టేసి మరీ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. రేటింగ్ తక్కువ ఉన్నా.. కథ, కథనాలు నచ్చడంతో సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ రివ్యూలకు సంబంధం లేకుండా సినిమాల రిజల్ట్ ఉంటుంది. అలా.. తక్కువ స్టార్స్ రివ్యూ వచ్చినా.. 100 రోజులు ఆడిన సినిమాల లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.
Advertisement
గంగోత్రి:
అల్లు అర్జున్, ఆర్తి అగర్వాల్ జంటగా వచ్చిన సినిమా గంగోత్రి. 2003 మార్చి 23న ఈ సినిమా విడుదల అయ్యింది. ఇది అల్లు అర్జున్ మొదటి సినిమా. దీనికి రివ్యూలు అంత బాగా రాలేదు. నటీనటుల నటన సరిగ్గా లేదు అంటూ రివ్యూలు రాసారు. కానీ, రిలీజ్ అయ్యాకా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే.
పోకిరి:
2006లో విడుదలైన పోకిరి సినిమా మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ టర్న్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి కూడా రివ్యూ బాలేదు. కానీ విడుదల అయిన రెండో రోజు నుంచి పాజిటివ్ టాక్ తో పోకిరి దూసుకెళ్లింది.
లక్ష్మి:
Advertisement
విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో లక్ష్మి సినిమా ఓ మైలు రాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో నయనతార, ఛార్మీలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా పాత కథలా ఉంది అంటూ రివ్యూలు వచ్చాయి. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దేశముదురు:
2007 లో వచ్చిన దేశముదురు సినిమాకి కూడా చాలానే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. వయొలెన్స్ ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా తరువాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రచ్చ:
రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన రచ్చ సినిమా కూడా ముందు నెగటివ్ ట్రోలింగ్ కి బలి అయింది. ఈ సినిమాకి కూడా నెగటివ్ రివ్యూలు చాలానే వచ్చాయి. కానీ రిలీజ్ తరువాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
ధమాకా:
రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ధమాకా. డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమాకు కూడా నెగటివ్ రివ్యూ వచ్చింది. కానీ రిలీజ్ తరువాత ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
Read More:
Animal Movie: యానిమల్ సినిమాపై వైరల్ అవుతున్న మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు!
మరీ ఇంత బలుపులేంట్రా ? ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి కప్ గెలిచిన ఆనందం లో ఇండియా ని ఇలా అవమానించారా ?