Advertisement
ఆడవారు ఎన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నా.. భావోద్వేగాల విషయంలో మాత్రం వారు కొంచం సున్నితం అనే చెప్పవచ్చు. చిన్న చిన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వారు బాధ పడుతూ ఉంటారు. అయితే.. స్త్రీ ఏడుపు అస్సలు మంచిది కాదట. ఏ ఇంట్లో స్త్రీ ఏడుస్తున్నా.. వారికి అది అరిష్టాన్నే తీసుకొస్తుంది. ఆడవారిని సున్నితంగా చూసుకోవడం మగవారికి తెలిసి ఉండాలి. లేదంటే వారి అహంకార పూరిత మాటలకు స్త్రీలు కన్నీళ్లు పెడతారు. అది ఏ ఇంటికీ అంత మంచిది కాదు.
Advertisement
కన్నీళ్లు చాలా విలువైనవి. వాటిని చిన్న చిన్న కారణాలకు వృధా చేయకూడదు. చాలా మంది పెళ్లి అయ్యిన అమ్మాయిలు సంసారంలో అడ్జస్ట్ అవ్వలేక, భర్త మాట్లాడే మాటలకు హర్ట్ అవుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఇది అసలు మంచిది కాదు. బాధని దాచుకోమని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ ఏ సంసారం అయినా గొడవలు లేకుండా ఉండడం అనేది జరగని పని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. ఈ విషయాన్నీ అర్ధం చేసుకోవాలి. భర్త అహంకార పూరిత ప్రవర్తనకు, భార్య ఓర్పు తోడై సర్దుకుంటేనే సంసారం నడుస్తుంది అన్న విషయాన్నీ అర్ధం చేసుకోవాలి, అంగీకరించడం నేర్చుకోవాలి.
Advertisement
ఇక పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్తున్న అమ్మాయి తన తల్లితండ్రులకు దూరం గా ఉండాలి అన్న విషయానికి బాధ పడాల్సి రావచ్చు. తల్లి తండ్రులు చనిపోయిన సందర్భంలోను, భర్త మరణించిన సందర్భంలోనూ భరించలేనంత దుఃఖం రావచ్చు. ఇటువంటి విలువైన సందర్భాల్లో తప్ప ఇతర చిన్న చిన్న కారణాలకు ఏడుస్తూ.. ఇంటికి అరిష్టాన్ని తీసుకురాకూడదు. స్త్రీ ఏడుపు ఏ ఇంటికీ అంత మంచిది కాదు. అందుకే వీలైనంత వరకూ స్త్రీ మనసుని కష్టపెట్టకుండా చూసుకోవడం నేర్చుకోవాలి.
Read More:
పటౌడీ ప్యాలెస్ లో యానిమల్ సినిమా షూటింగ్.. వైరల్ అవుతున్న ఫోటో వెనుక స్టోరీ ఏంటంటే?
Happy New Year 2024: Wishes, Quotes, Messages, Images, Greetings in Kannada ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು 2024