Advertisement
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో రింకు సింగ్ కూడా ఒకరు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నాడు రింకు. రింకు 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో వరుసగా ఐదు సిక్సులు కొట్టాడు. జట్టు ని గెలిపించాడు. ఆ ఒక్క మ్యాచ్ కి మాత్రమే కాదు. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడాడు 59.25 యావరేజ్ 149.53 స్ట్రైక్ రేటుతో 474 పరుగులు చేశాడు. 2018లో కూడా ఐపిఎల్ ఆడాడు 2022 వరకు నాలుగేళ్లలో రింకు సింగ్ 17 మ్యాచ్‌లే ఆడాడు. కానీ 2023లో మాత్రం 14 మ్యాచ్‌లు ఆడాడు 2023 లోనే టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.
Advertisement
రింకు ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ కి అడుగుపెట్టి రింకు సింగ్ సౌత్ ఆఫ్రికా తో రెండు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటిదాకా 12 అంతర్జాతీయ టి20 లో ఆడాడు. 65 కి పైగా యావరేజ్ తో 262 రన్స్ చేశాడు. రెండు వన్డేలలో కలిపి 55 పరుగులు తీశాడు అయితే బీసీసీఐ తీసుకు వస్తున్న నిబంధనలు ప్రకారం చూసినట్లయితే ఎవరైనా అన్క్యాప్డ్ ఆటగాడు రెండు ఐపీఎల్ సీజన్ల మధ్య టీమిండియా నుండి ఆడితే రెండో సీజన్లో ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది.
Advertisement
బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్ క్యాప్డ్ ఆటగాడు ఇండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడిన మరుసటి సీజన్ కి ఐపీఎల్ వేతనం 50 లక్షలు అవుతుంది. అయితే ప్లేయర్ కనీస వేతనం 50 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. రింకు సింగ్ ఐపీఎల్ వేతనం 55 లక్షలు కోటి అవ్వాల్సిన అతని ఐపీఎల్ శాలరీ పెరగకుండా అలా ఉండిపోయింది ఒకవేళ బీసీసీఐ సడలింపులు ఇస్తే అప్పుడు మాత్రమే అతని వేతనం పెరుగుతుంది కోల్కత్తా రిటైన్ చేసుకోవడంతో అతని ఐపీఎల్ శాలరీ 55 లక్షల దగ్గర ఉండిపోయింది కోల్‌కతా ని కనుక రింక్ ని రిలీజ్ చేస్తే అప్పుడు అతని ఐపిఎల్ శాలరీ 10 రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!