Advertisement
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పలువురు రాజకీయ, సినీ సెలెబ్రిటీల గురించి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే.. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరగడంతో కొందరు ఆయనను ఫాలో చేస్తుంటారు. అయితే.. వేణుస్వామికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో.. హేటర్స్ కూడా అలానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Advertisement
గతంలో ఆయన చెప్పిన జోస్యాలు కొన్ని నిజం అవ్వడంతో.. ఆయనను నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే.. కొన్ని వివాదాస్పద జోస్యాల కారణంగా ఆయనను హేట్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవల ఆయన చెప్పిన జోస్యాలు కొన్ని నిజంగా జరగలేదు. తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని వేణు స్వామి చెప్పారు. కానీ, ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే.. సలార్ సినిమా కూడా హిట్ అవ్వదు అని అన్నారు. కానీ, సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
Advertisement
దీనితో సోషల్ మీడియాలో వేణు స్వామి గురించిన ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈయన గురించి ఇంకో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఈయన అసలు వృత్తి జాతకాలూ చెప్పడం కాదని.. అది కేవలం సైడ్ బిజినెస్ మాత్రమే అని ఈ వార్తల సారాంశం. వేణు స్వామి తన మెయిన్ బిజినెస్ గా ఓ పబ్ ని నిర్వహిస్తున్నారట. ఈ విషయాన్నీ ఆయనే గతంలో తెలియచేసారు. జాతకం ప్రకారం తనకు ఏ బిజినెస్ బాగుంటుందో చూసుకున్నానని.. పబ్ నడిపించడం తనకు కలిసి వస్తుందని.. అందుకే తాను పబ్ ని నడిపిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈయన మెయిన్ బిజినెస్ ఏమిటో తెలిసిన తరువాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read More:
“చెల్లెల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్న శివాజీ” అసలు జరిగింది ఇదేనా ? ఆ అమ్మాయి ఎవరంటే ?