Advertisement
తమిళ సీనియర్ నటుడు డీఎంకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత కరోనా బారిన పడి మృతి చెందడం జరిగింది విజయ్ కాంత్ 80, 90 దశకాల్లో వందలాది సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. తర్వాత డిఎంకె పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి వెళ్లారు. విజయ్ కాంత్ సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానులకు, కుటుంబ సభ్యులు కి దూరం అవుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు విజయ్ కాంత్.
Advertisement
విజయ్ కాంత్ చనిపోవడంతో సినీ, రాజకీయ లోకం శోక సంద్రం లో మునిగి పోయింది అయితే నటుడు విజయ్ కాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ క్రమం లోనే బయటికి వచ్చాయి. విజయ్ కాంతి తెలుగోడి రక్తమే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయ కాంత్ స్వయంగా ఒక సందర్భం లో చెప్పడం జరిగింది. వందల ఏళ్ళ క్రితం బ్రిటిష్ కాలంలో తన తాత ముత్తాతలు ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు కి వలస వెళ్లి పోయారట అలా విజయకాంత్ కి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. అంతా విజయ్ కాంత్ తెలుగు రక్తమే అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆస్పత్రి నుండి విజయకాంత్ క్షేమంగా వస్తారని అంతా భావించారు కానీ ఈ కరోనా సోకడం వలన ఆయన్ని మరొక సారి ఆసుపత్రికి తరలించారు కరోనా వలన ఆయన ఆరోగ్యం విషమించడం వలన చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. విజయ్ కాంత్ చేసిన సేవల్ని అలానే అయిన నటించిన సినిమాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!