Advertisement
సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరైనా చనిపోతే వాళ్ళ జ్ఞాపకాలు ప్రేక్షకుల్లో అలా ఉండిపోతుంటాయి. వాళ్ళు నటించిన సినిమాలను అలానే వాళ్ళ సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. తమిళ సినిమా పరిశ్రమలో దైవం కంటే ఎక్కువగా అభిమానించే రాజకీయ నాయకులగా మారి సినీ తారలు మరణాలు డిసెంబర్లోనే జరగడం విషాదానికి గురి చేసింది తమిళ ప్రజల్ని శోకసంద్రంలోకి ముంచేసింది. తమిళ సినిమా రంగంలో తన ప్రభావాన్ని చాటుకుంది జయ లలితా. సినీ నటుల్ని రాజకీయాల్లో కూడా ఆదరించే గొప్ప నేతలుగా చేశారు.
Advertisement
తమిళ ప్రజలు. వాళ్ళల్లో ముఖ్యంగా ఎంజీఆర్ కరుణానిధి జయలలిత విజయ్ కాంత్ వున్నారు. అయితే తమిళ సినిమా రంగంలోని రాజకీయ రంగానికి విశేష సేవలు అందించిన ఎంజీఆర్ అలానే జయలలిత విజయకాంత్ వీళ్ళందరూ కూడా డిసెంబర్ నెలలోనే చనిపోయారు. ఎంజీ రామచంద్రన్ కి 1984లో అనారోగ్య సమస్య రావడం షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం అలానే తీవ్రమైన గుండెపోటు రావడం వలన డిసెంబర్ 24న 1987లో చనిపోయారు.
Advertisement
జయలలిత 2016 సెప్టెంబర్ 22వ తేదీన డిహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ కారణంగా అపోలో హాస్పిటల్ లో చేరారు. 2016 డిసెంబర్ 4న ఆమె చనిపోయారు. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు అయిన విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరారు క్షేమంగా తిరిగి వస్తారని అనుకున్నారు కానీ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కరోనా రావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఇలా డిసెంబర్ నెలలో వీళ్ళందరూ కూడా కన్నుమూశారు. ఇదేదో శాపము లేదంటే యాదృచ్చికమో కానీ డిసెంబర్ నెల తమిళ ప్రజలకి తీరని విషాదాన్ని నింపుతోంది నటులు, రాజకీయనేతలు అయిన వీళ్ళ ముగ్గురు కూడా డిసెంబర్లోనే కాలం చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!