Advertisement
సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పలువురు రాజకీయ, సినీ సెలెబ్రిటీల గురించి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తుంటారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే.. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరగడంతో కొందరు ఆయనను ఫాలో చేస్తుంటారు. అయితే.. వేణుస్వామికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో.. హేటర్స్ కూడా అలానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Advertisement
వేణుస్వామి తరచూ సెలెబ్రిటీల జాతకాల గురించి చెప్తూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన జోస్యాలు కొన్ని సార్లు నిజమైతే.. మరికొన్ని సార్లు బెడిసి కొట్టాయి. అయితే.. వేణుస్వామికి ఎంత ఫాలోయింగ్ ఉందొ.. హేటర్స్ కూడా అంతమంది ఉన్నారు. ఆయన తరచూ ఎన్టీఆర్ జాతకం గురించి కూడా మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా.. ఆయన ఎన్టీఆర్ జాతకంలో దోషం గురించి చెబుతూ అందరిని భయపెట్టేస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన స్వయంగా ఎన్టీఆర్ తల్లికే వివరించారట.
Advertisement
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఓ సారి ఎన్టీఆర్ తల్లి, వేణు స్వామి కూర్చున్న సమయంలో ఎన్టీఆర్ జాతకం గురించి వేణు స్వామి ఎన్టీఆర్ తల్లితో చర్చించారట. ఎన్టీఆర్ జాతకంలో ఉన్న దోషం గురించి చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయారట, ఆ విషయం తనకి, తారక్ కి, పెద్ద ఎన్టీఆర్ కు మాత్రమే తెలుసనీ.. నాలుగో వ్యక్తికీ తెలియదని.. మీరు అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారని అడిగారట. నాకు అంతా తెలుసమ్మా అని సమాధానం ఇచ్చానని వేణు స్వామి చెప్పారు. తారక్ ది మఖా నక్షత్రం. జయలలిత నక్షత్రం కూడా అదే. తారక్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అందుకు సమయం ఉందని.. తారక్ కు రాజయోగం ఉందని.. దానికి తగ్గట్లే సినిమా కెరీర్ లో దూసుకెళ్తున్నారని… వేణు స్వామి చెప్పుకొచ్చారు. తారక్ ను 2030 వరకు రాజకీయాల్లోకి రావద్దని చెప్పినట్లు పేర్కొన్నారు.
Read More:
‘కుర్చీ మడతపెట్టి’ పాటని కావాలనే కాపీ చేశారా? తమన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!
Devil Movie Review: కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్…!
డిసెంబర్లోనే ముగ్గురు తమిళ దిగ్గజ నటులు చనిపోయారు… ఇదేం శాపమో…!