Advertisement
తెలుగు సినిమాలు ఆల్ ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో.. తెలుగు సినిమా రేంజ్ గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగిందనే చెప్పవచ్చు. అయితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు కూడా ఓ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అనేక కాంట్రవర్సీలు ఎదురవుతూ ఉన్నాయి. 2023 వ సంవత్సరంలో కాంట్రవర్సీ అయిన ఇష్యుస్ ఏమిటి? ఇవి ఎలా మొదలయ్యాయి? ఈ కాంట్రవర్సీస్ వలన హైలైట్ అయిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
2023 లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమా “ఆదిపురుష్”. భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో ప్రభాస్ పై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇలాంటి సినిమా ఎలా చేసారు? అంటూ ప్రభాస్ ని కూడా క్వశ్చన్ చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” సినిమా కూడా రాజకీయ పరమైన కాంట్రవర్సీలకు తెరలేపింది. ఈ సినిమాలో ఏపీ మంత్రిని పోలిన క్యారక్టర్ పెట్టారంటూ వివాదాలు వచ్చాయి. అలాగే ఈ సినిమా కలెక్షన్లు, కనెక్షన్ల గురించి కూడా సదరు క్యారక్టర్ ని పోలిన మంత్రి గట్టిగానే కామెంట్స్ చేసారు.
Advertisement
రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ చాలామందే అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కూడా ఈ సినిమా రిలీజ్ ను జనవరి 12 వరకు పోస్టుపోన్ చేయాలనీ ఆదేశించింది. సినిమాలే కాకుండా.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా వివాదాలే జరిగాయి. ఏజెంట్ సినిమా పరాజయం పొందడంతో డిస్ట్రిబ్యూటర్లు గట్టిగానే రచ్చ చేశారు. నందమూరి బాలకృష్ణ కూడా “అక్కినేని తొక్కినేని” అనడం కూడా కాంట్రవర్సీ అయ్యింది. ఇంకా యంగ్ డైరెక్టర్ మహా కెజిఎఫ్ సినిమాపై కామెంట్స్ చేయడం కూడా దుమారం లేపింది. అలాగే.. అనసూయ మరియు విజయ్ దేవరకొండల మధ్య వివాదం కూడా కాంట్రవర్సీగా మారింది. అలాగే మంచు బ్రదర్స్ మధ్య కూడా ఓ రేంజ్ లో వివాదాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఓ వీడియో వైరల్ అయ్యింది కూడా.
Read More:
ఈ దేవతల గురించి తెలుసా? తిరుమల సంపాదనని కాపాడే దేవతలు వీరేనట!
డాక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా.. ఈ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అంటారు.. కానీ తన భర్త?