Advertisement
సీనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు చాలామంది హీరోయిన్లతో తోటి నటులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ చాలా సినిమాలు చేశారు. మంచి హిట్స్ ని కొట్టేశారు రాఘవేంద్రరావుకి ఎన్టీఆర్ చాలా సినిమాలు కలిసి చేసారు. ఎన్టీఆర్ కి చాలా మంచి హిట్స్ ని కూడా ఇచ్చారు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ కి హిట్లు ఇచ్చినంతగా బాలకృష్ణకి కానీ నాగేశ్వరరావు కానీ ఇవ్వలేకపోయారు.
Advertisement
ఇది ఇలా ఉంటే ఒకరోజు రాఘవేంద్రరావు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి హీరోయిన్ గురించి చెప్పాలని అనుకున్నారు. శ్రీదేవితో సినిమా అని రాఘవేంద్రరావు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి చెప్పాలట. శ్రీదేవి వయసు చాలా చిన్నది. శ్రీదేవి గురించి చెప్పగానే ఎన్టీఆర్ ఏమంటారు అని రాఘవేంద్రరావు గారు కాస్త ఆలోచిస్తూ వెళ్లారట. అప్పుడు ఆమె వయసు పదహారేళ్ళ ని రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కి చెప్పారట. ఎన్టీఆర్ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ఆమెకి పదహారేళ్లయితే నాకు 14 అని అన్నారట. ఇలా హీరోయిన్ గా శ్రీదేవిని ఎన్టీఆర్ ఒప్పుకున్నారు.
Advertisement
ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి. 1979లో వేటగాడు సినిమా రిలీజ్ అయింది. శ్రీదేవి ఎన్టీఆర్ ఈ ఒక్క సినిమా కాకుండా సర్దార్ పాపారాయుడు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, కొండవీటి సింహం, అనురాగ దేవత ఇలా చాలా సినిమాలు చేశారు. ఐదు పదులు దాటినా ఎన్టీఆర్ పదహారేళ్ల శ్రీదేవితో చాలా సినిమాల్లో చేశారు. వీళ్ళ మధ్య సుమారు 47 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. శ్రీదేవి ఎన్టీఆర్ తాతా మనవరాలుగా నటించిన సరే ప్రేక్షకులు హీరో హీరోయిన్ గా నటించినప్పుడు కూడా పట్టించుకోలేదు వీళ్ళ కాంబినేషన్లో పదికి పైగా సినిమాలు వచ్చాయి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!