Advertisement
అయోధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో ఉంది. ఇది రాముడు పుట్టిన చోటు. కానీ.. ఇప్పటివరకు ఇక్కడ రాముడి గుడి నిర్మాణానికి కుదరలేదు. భారత దేశంలో ప్రతి వీధికి ఓ రామాలయం ఉంటుంది. భారతీయులకు రాముడంటే అంత ప్రీతీ. కానీ, అయోధ్యలో మాత్ర రాముని గుడి నిర్మాణం జరగలేదు. ఈ కేసు చాలా కాలం కొనసాగి ఎట్టకేలకు హిందువులు విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు అయోధ్యలో రాముని గుడి నిర్మాణం పూర్తయింది. అయోధ్యకి రాముడు వస్తున్నాడు.
Advertisement
జనవరి 22, 2024న మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా చాలా మంది ప్రముఖ అతిథులను ఆహ్వానించారు. వేడుక సజావుగా నిర్వహించబడడానికి భద్రతకు సంబంధించి అనేక నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి. పవిత్రోత్సవం రోజున ప్రవేశానికి సంబంధించి ఒక లేఖ జారీ చేయబడింది. ఆలయ ప్రవేశం పొందడానికి ఈ ముఖ్యమైన అంశాలకు కట్టుబడి ఉండటం అవసరం.
Advertisement
- ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులు జనవరి 22న ఉదయం 11:00 గంటలలోపు కార్యక్రమ వేదికలోకి ప్రవేశించాలి.
- భద్రత పరంగా, ఎవరైనా సాధువు లేదా ఆధ్యాత్మిక నాయకుడితో పాటు ఎవరైనా భద్రతా సిబ్బంది ఉంటే, వారు కార్యక్రమ వేదిక వెలుపల ఉండవలసి ఉంటుంది.
- ఆహ్వాన పత్రంలో పేరు ఉన్న వ్యక్తికి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. కార్యక్రమ వేదిక వద్దకు సేవకులు లేదా వారితో పాటు వచ్చే శిష్యులను అనుమతించరు.
- రామాలయానికి ప్రధాన అతిధేయుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆలయ ప్రాంగణం నుండి బయలుదేరిన తర్వాత మాత్రమే సాధువులకు రాంలాలా దర్శనానికి అనుమతి ఇస్తారు.
- రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించాలి. పురుషులు ధోతీ, గంచా, కుర్తా-పైజామా మరియు స్త్రీలు సల్వార్ సూట్లు లేదా చీరలు ధరించవచ్చు. అయితే దీనికి సంబంధించి రామ్ టెంపుల్ ట్రస్ట్ ఎలాంటి డ్రెస్ కోడ్ విధించలేదు.
- ఆహ్వాన పత్రాలు ఉన్నవారు, విధుల్లో ఉన్నవారు మాత్రమే అయోధ్యలోకి ప్రవేశానికి అనుమతిస్తారు.
ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. - అలాగే హోమ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్.. చివరకు బయట నుంచి తెచ్చిన పానీయాలు కూడా అనుమతిలేదు.
- ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుని మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలి.
Read More:
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తన తమ్ముడి కొడుకే అయిన కూడా ఎన్టీఆర్ ఎందుకు దూరం పెట్టారు ?
అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఎక్కువగా ఉంటె ఆ పెళ్లి నిలబడుతుందా?