Advertisement
భూమ్మీద జన్మించిన ఏ జాతి, ఏ మతం, ఏ కులం వారైనా సరే సర్వ జీవరాశుల్లో ఆత్మ రూపమై వెలుగొందే ఆ పరమాత్మను ఏమాత్రం చూడకుండా వారి యొక్క అహంకారంతో గర్వంతో జంతువుల విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛ జీవనాన్ని కోరుకుంటాయి కానీ కొంతమంది క్రూర మృగాల లాగా జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమ్మీద లెక్కలేనన్ని మంది ఉన్నారు. ఇలాంటి చండాలమైన నీచ పనులు చేసే కొంతమంది ఆ జంతువులను ఏ విధంగా అయితే వాళ్లు హింసించి చంపారో వారు కూడా అదే విధంగా మరణిస్తారని చెప్పబడింది.
Advertisement
Also Read: ఇండియాలో ఫోన్ నెంబర్లకు +91 అని ఎందుకు ఉంటుందో తెలుసా ?
ఇలా జంతువులను చంపి వాటి మాంసాన్ని తినే వాళ్ళు ఎంతటి సంపన్నులైన సరే వాళ్లది అసుర ప్రవృత్తి కిందకే వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మాంసం తినడం మానేస్తే వంద సంవత్సరాల తపస్సు చేసిన ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రాణి హింస వాటిని చంపి తినడం అనేది ఉత్తమమైన మానవ జన్మలో రాయ బడలేదని అంటారు. చివరికి పశుపక్ష్యాదులను కూడా ఉత్తమమైనవిగా చెప్పబడేవి ఏవైనా సరే మాంసం తినవు. అవి ఆవు,గేదె, లేడీ, గుర్రం వంటి జంతువులు ఆకులు తృణధాన్యాలు తప్ప మాంసాహారం తినవు. అదే నికృష్ట జీవుల కిందికి వచ్చేవి పులి,నక్క,తోడేలు కొన్ని జంతువులు మాంసాన్ని తింటూ ఉంటాయి.
Advertisement
అలాగే పక్షుల జాతులలో కోయిల హంస, రామచిలక, వంటి పక్షులు శాకాహారులే.. అలాగే గద్ద, రాబంధు, కాకి వంటి జంతువులు మాంసం తింటాయి. మాంసం తినే జీవులను నికృష్ట జీవులుగా పరిగణిస్తారు. కాబట్టి మనం మానవ జన్మ ఎత్తినప్పుడు జంతు హింసకు పాల్పడకుండా ఉండాలనేది శాస్త్రాలు చెబుతాయి. ఒక జంతువును చంపే ముందు అది ఎలాగైనా తప్పించుకోవడానికి దానికి ఉన్న బలాన్ని అంతా ఉపయోగించి గుంజు కుంటూ ఉంటుంది. ఆ జీవి ప్రాణం పోయాక అది కొన్ని నిమిషాలపాటు గిలగిలా కొట్టుకుంటూ పడే నరకయాతన ఎలా ఉంటుందో మీరు చూస్తూనే ఉంటారు. అలా చనిపోయిన జంతువు మాంసాన్ని కడుపారా తిన్న వాళ్లకి కూడా అదే విధమైన మృత్యువు వస్తుందని, శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందుకే జంతుబలులు చేసి మాంసాన్ని తినవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి.
ALSO READ: 8 ఏళ్ల సినీ కెరీర్ లో రాశిఖన్నా మిస్ చేసుకున్న సినిమాలు ఇవే!