Advertisement
ఒకసారి పాపులారిటీ, స్టార్ డమ్ వచ్చిన తరువాత అహంకారం కూడా ఎంతో కొంత ఆభరణంలా వస్తుంది. ఎంత పెద్ద వారైనా.. ఎంత ఒదిగి ఉండేవారైనా తమకంటూ గుర్తింపు వచ్చాక ఆ గుర్తింపు అన్నిచోట్లా ఉండాలని కోరుకోవడం సహజమే. అలా జరగనప్పుడు అదోలాంటి అహంభావం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితే ఓ సారి తనికెళ్ళ భరణికి, బ్రహ్మానందానికి ఎదురైంది. ఓసారి వీరిద్దరూ ఓ సినిమాలో షూటింగ్ కోసం పల్లెటూరికి వెళ్లారట. ఆ టైం లో ఓ గుడికి వెళ్లారట. అక్కడ ఓ పూజారి పూజ చేసుకుంటూ ఉన్నారు. వీరిద్దరిని చూడగానే అతను గుర్తు పట్టి వెంటనే వచ్చి పలకరిస్తారు అని వీరు అనుకున్నారు.
Advertisement
కానీ, ఎంతసేపైనా ఆ పూజారి రాలేదు. పోనిలే పూజ అయ్యాక అయినా వస్తాడని అనుకున్నారట. కానీ, పూజ అయినా కూడా ఆ పూజారి వీరి వద్దకు రాకపోవడంతో వీరిద్దరే ఆయన దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. వాళ్లిద్దరూ తమకు అభిషేకం చేయించమని అడిగితే.. ఆయన క్యాజువల్ గా ఓ చూపు చూసి ఇప్పుడు సమయం దాటిపోయిందని రేపు ఉదయాన్నే రావాలని చెప్పాడట. ఆ తరువాత రోజు ఉదయం ఏడుగంటలకు వీరిద్దరూ వెళ్లారు. అక్కడే దర్శనం, ప్రదక్షిణం, అభిషేకం అన్ని చేయించుకున్నారు. అయినప్పటికీ ఆ పూజారి చాలా సాధారణంగా ఉన్నాడట. తాము సెలెబ్రిటీలము అన్న సంగతి అతనికి తెలుసా లేదా ? అని వీరికి అనుమానం వచ్చిందట.
Advertisement
అదే విషయాన్నీ అడగగా.. నాకు తెలుసు మీరు తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం అని చెప్పారట. తెలిసిన ఎందుకు మాములుగా ఉన్నారు? అని అడుగగా.. మేము కనీసం దక్షిణ ఇచ్చినా తీసుకోలేదు, టిఫిన్ ఇచ్చినా.. చివరకు కాఫీ ఇచ్చినా తీసుకోలేదు.. ఎందుకు అని అడిగారు. దానికి ఆ పూజారి “సార్ నాకు ఓ ఎకరం పొలం ఉంది. ఒక ఆవు ఉంది. నా శివుడు ఉన్నాడు..ఇంకా నాకు ఏమి కావాలి? ఆ శివయ్య దగ్గరకి వచ్చే ఏ భక్తుడైన నాకు ఒక్కటే..” అని సమాధానం ఇచ్చాడట. ఈ సమాధానంతో మాకున్న అహంకారం కుప్పలా రాలిపోయింది అంటూ ఈ అనుభవాన్ని తనికెళ్ళ భరణి పంచుకున్నారు. ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే.. జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా? అని అనిపించిందట ఆ ఇద్దరికీ.
Read More:
అనస్వర రాజన్ ‘నేరు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?