Advertisement
పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈసారి పాకిస్థానీ నటి సనా జావేద్ ను షోయబ్ వివాహం చేసుకున్నారు. అతను తానూ మూడోసారి పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో.. సానియా మీర్జాతో అతని వైవాహిక జీవితం గురించిన చర్చ ఎక్కువైంది. ఈ క్రమంలో సానియా కుటుంబం కూడా వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు, సానియా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటె.. గతంలో షోయబ్, సానియాలు కలిసి షారుఖ్ తో ఇచ్చిన ఇంటర్వ్యూ కు సంబంధించిన క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
SRK సానియా మీర్జాను షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ ఈ ఇంటర్వ్యూ లో ప్రశ్నించారు. దానికి సోనియా సరదాగా సమాధానం ఇచ్చారు. నేను అతనిని ఎక్కువ గమనించలేదు. కానీ అతను చాలా షై గా ఉంటాడు. మీరు అతనికి మాట్లాడడం కూడా నేర్పించాలి అంటూ సరదాగా చెప్పింది. ఇదే ప్రశ్నని షారుఖ్ షోయబ్ ని కూడా ప్రశ్నించాడు.
Advertisement
సానియాను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అని షారుఖ్ షోయబ్ ను అడగ్గా.. అసలు అప్పుడు ఆలోచించడానికి సమయం రాలేదని… ఆలోచించడం కంటే ముందే తనని పెళ్లి చేసేసుకున్నానని షోయబ్ తెలిపాడు. దానికి షారుఖ్ సరదాగా.. మీరు ఇండియాలో ఉన్నారు. పొరపాటున కూడా కన్ఫ్యూజ్ కావద్దు అంటూ సెటైర్ వేశారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read More:
అనస్వర రాజన్ ‘నేరు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?