Advertisement
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కు నటవారసుడిగా పదహారేళ్ళ వయసులోనే సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆయనకు పదహారేళ్ళప్పటి నుంచి ఎన్టీఆర్ తో పాటు సెట్స్ కు వెళ్లేవారు. ఎన్టీఆర్ తో పాటే సినిమాల్లో నటించేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ బాలకృష్ణకు ఎన్నో మెళకువలు కూడా నేర్పించేవారట. ఎన్టీఆర్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ చాలా సినిమాల్లో నటించారన్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఒకటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా.
Advertisement
ఈ సినిమాలో టైటిల్ రోల్ ను ఎన్టీఆర్ పోషించారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా. ఈ సినిమాలోనే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుడిగా బాలకృష్ణ కనిపిస్తారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ రోజుల్లోనే నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్ ను రాబట్టింది. ఈ సినిమాకి పూర్తి దర్శకత్వం బాధ్యతలు ఎన్టీఆర్ గారే తీసుకున్నారు. అయితే.. బాలకృష్ణకు కూడా సినిమా ఎలా తీస్తారు అన్న విషయమై అవగాహనా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణతో కూడా చాలా పనులు చేయించారట.
Advertisement
ఈ సినిమాలో కెమెరామాన్ వర్క్ ను బాలకృష్ణకు అప్పగించారు. ఎన్టీఆర్ గారే దగ్గరుండి ఈ వర్క్ ఎలా చేయాలో నేర్పించారట. అలా బాలకృష్ణ మొదటగా కెమెరామెన్ గా పని చేసారు. అయితే.. ఈ సినిమా విడుదల మాత్రం ఆలస్యం అయ్యింది. సెన్సార్ వారు అడ్డుకట్ట వేయడంతో సినిమా రిలీజ్ ఆగింది. ఆ తరువాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిన తరువాతే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అప్పట్లోనే కోట్లలో కలెక్షన్ సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది.
Read More:
మొట్టమొదటి సారి డివోర్స్ పై స్పందించిన నిహారిక.. ఆ తరువాతే ఫ్యామిలీ విలువ తెలిసొచ్చింది అంటూ..!
కొత్తపార్టీ పెట్టిన దళపతి విజయ్.. లోక్ సభ ఎన్నికల నెల రోజుల ముందు?