Advertisement
విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లి మీడియాతో విభేదించారు. తమ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. వికాస్ ఇన్స్టాగ్రామ్లో తమ తల్లి, సరోజ్ కోహ్లి ఆరోగ్యం బాగోలేదని వస్తున్న పుకార్ల గురించి స్పందించారు. ఈ వార్తలన్నీ అబద్ధం అని పేర్కొన్నారు. ఈ వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరారు.
Advertisement
గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ తల్లి సరోజ కోహ్లీ ఆరోగ్యం బాగోలేదని, ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వైదొలగడమే సరోజ అనారోగ్యానికి కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, వికాస్ ఇలా వ్రాశాడు, “మా అమ్మ ఆరోగ్యం గురించి ఈ ఫేక్ న్యూస్ చుట్టూ తిరుగుతున్నట్లు నేను గమనించాను. మా అమ్మ ఖచ్చితంగా ఫిట్ గా, బాగానే ఉందని నేను స్పష్టం చేస్తున్నాను. అలాగే, నేను ప్రతి ఒక్కరినీ మరియు మీడియాను కూడా అభ్యర్థిస్తాను. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దు. మీ ఆందోళనకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంటూ వికాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పేర్కొన్నారు.
Advertisement
ఉన్నట్లుండి విరాట్ కోహ్లీ తల్లి సరోజ కోహ్లీ ఆరోగ్యం బాగోలేదు అంటూ వార్తలు రావడంపై విరాట్ అభిమానులందరూ కంగారు పడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వెళ్లిపోవడం వల్లే ఆమెకు అనారోగ్యం వచ్చిందని ఈ వార్తల్లో పేర్కొన్నారు. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని, సరోజ కోహ్లీ పూర్తి ఫిట్ గా, ఆరోగ్యంగానే ఉన్నారని విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు.
Instagram story by the brother of Virat Kohli.
– All the news about the mother of Virat Kohli is fake. pic.twitter.com/TBDP1PwWfh
— Johns. (@CricCrazyJohns) January 31, 2024
Read More:
హనుమాన్ గా చిరంజీవి, శ్రీరాముడిగా మహేష్ బాబు..? ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్!
వరుస పెట్టి అడ్డంకుల్ని ఎదుర్కొంటున్న కొరటాల శివ.. అసలేం అయ్యిందంటే?
సుకుమార్ పై అల్లు అర్జున్ ఆగ్రహం.. అసలు కారణం అదేనా?