Advertisement
అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలను యావత్ భారతం కన్నుల పండువగా వీక్షించింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారు దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను వీక్షించారు. అయితే.. ఆహ్వానం ఉన్న వారు ఆ అయోధ్యకు వెళ్లి రాముల వారిని దర్శించారు. అయితే.. ఈ వేడుకలకు ముస్లిం పెద్ద ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ కూడా పాల్గొన్నారు. దీనితో ఆయన సొంత వర్గం ప్రజల నుంచి ఫత్వానిని ఎదుర్కొంటున్నారు. మతం మానవత్వాన్ని మించింది కాదు. రామ్, రహీం ఒక్కడే అని భారతీయులు విశ్వసిస్తారు.
Advertisement
దేశ విదేశాల నుంచి మతాలకు అతీతంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. అయితే.. ఈ వేడుకలకు హాజరు అయినందుకు గాను ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఫత్వా ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్నీ ఆయనే తెలియచేసారు. పిటిఐ విడుదల చేసిన వీడియో లో మాట్లాడిన ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకల రోజు నుంచి కొంతమంది తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.
Advertisement
తనకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఫత్వా జారీ చేసారని అందులో తన మొబైల్ నెంబర్ పెట్టినట్లు పేర్కొన్నారు. తనను ముస్లిం మతం నుంచి బహిష్కరించాలని అందరు ఇమామ్ లు మసీద్ అధికారులను కోరారని తెలిపారు. తాను రామ్ లల్లా కార్యక్రమానికి హాజరు అయినందుకు క్షమాపణ చెప్పి, తన పదవి నుంచి రాజీనామా చేయాలనీ చెప్పారన్నారు. తనకు ఆహ్వానం అందినప్పుడు వెళ్లాలా వద్దా అన్న విషయమై రెండు రోజుల పాటు ఆలోచించానని.. ఇది నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం అవుతుందని నాకు తెలుసు అని అన్నారు. తన రాక పట్ల అక్కడ అందరు సంతోషం వ్యక్తం చేసారని, నేను ఎటువంటి తప్పు చెయ్యలేదని, నేను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని… భారత్ విశ్వగురుగా అవతరిస్తున్న తరుణంలో మనమంతా ఒక్కతాటిపై నడవాలని ఇమామ్ ఇల్యాసి చెప్పుకొచ్చారు.
Read More:
ప్రశాంత్ వర్మ జీవితం లో ఈమె చాలా స్పెషల్ ! ? దర్శకుడు అవ్వకముందు ఏ ఉద్యోగం చేసేవారంటే ?
వాడు 80 కోట్లు కొట్టేయడం వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్ తల్లి!