Ads
ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అన్నీ తమ పార్టీల తరపున ప్రచారం చేసుకోవడంలో బిజీ అయ్యాయి. ఇక వివిధ పార్టీ నేతల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. “భారత్ మాత హై కౌన్?” అంటూ ఆయన రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయాల్లో వివాదాస్పదం అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ప్రచారం కోసం రాహుల్ గాంధీ కూడా సిద్ధం అయ్యారు. అయితే.. బుండిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. “భారత్ మాతా కీ జై ” కి బదులుగా “ఆదానీజీ కి జై..” అనాలని చెప్పారు. ఎందుకంటే మోడీ ఆయనకోసమే పని చేస్తున్నారు కాబట్టి.. అంటూ బీజేపీ పార్టీ పై సెటైర్లు వేశారు.
Advertisement
A case should be filed against this
— nytcrawler 卐 🕉 🇮🇳🚩 (@nigh_ai_crawler) November 19, 2023
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బీజేపీ పార్టీ మరియు ఆదానీ గ్రూపులను రాహుల్ గాంధీ తరచుగా లక్ష్యంగా చేసుకుని.. వారిని ప్రచార కార్యక్రమాలలో విమర్శిస్తున్నారు. ఆదానీ స్కాం ల గురించి బయటకు రావడంతో రాహుల్ గాంధీ ఆదానీ గ్రూపు పై ప్రత్యక్ష విమర్శలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోంది అంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
Read More:
ఈ ఆటగాళ్లు తమ చివరి వరల్డ్ కప్ ఆడేశారా? నెక్స్ట్ వరల్డ్ కప్ కి వీరు ఉండట్లేదా?
రాహుల్ ద్రావిడ్ పై తొలి వేటు? ఇకపై కోచ్ గా ఉంటారా.. ఉండరా?