Advertisement
మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వయసు పెరకే కొద్దీ చాలా మార్పులు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లడం తర్వాత పెద్దయన తర్వాత ఆఫీస్ కి వెళ్లడం ఇలా రోజురోజుకే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది మనం చేయవలసినవి పెరుగుతూ ఉంటాయి. ఇది పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్ళు చదివితే బాగుంటుంది. పైగా బాగా అర్థమవుతుంది వాళ్లకి మాత్రమే కాబట్టి కచ్చితంగా దీనిని మిస్ అవ్వకుండా చదవండి. ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచిది. ఉదయం 6 గంటల సమయం ఆఫీస్ కి వెళ్లడానికి నేను లేవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ లేవలేకపోతున్నాను.
Advertisement
ఏమైంది నాకు..? ఎందుకు లేవలేక పోతున్నాను ఒక్క నిమిషం నేను ఆలోచించాను నిన్న రాత్రి నిద్రపోవడానికి గదిలోకి వచ్చాను. అప్పుడు గుండెల్లో ఏదో ఇబ్బందిగా అనిపించింది నొప్పి వచ్చింది. స్పృహ లేకుండా పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కాఫీ కావాలి… నా భార్య ఎక్కడ ఉంది ఎందుకు నన్ను నిద్ర లేపలేదు ఆఫీస్ టైం అవుతోంది కదా నా పక్కన ఎవరూ లేరు… వసారాలో ఎవర్నో పడుకోబెట్టి ఉన్నారు. ఇంటి బయట గుంపు ఉంది ఎవరో చనిపోయి ఉన్నారు. అయ్యో.. అది నేనే దేవుడా నేను చనిపోయేనా బయట చాలా మంది ఏడుస్తున్నారు. నా మాటలు ఎవరికీ వినపడట్లేదు పక్క గదిలోకి చూసాను. నా భార్య ఏడుస్తోంది. కొడుకుని పట్టుకుని భార్యని పిలిచాను. తనకి కూడా నా మాటలు వినపడట్లేదు.
Advertisement
ఆ గదిలో మా అమ్మ నాన్న ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు నేను చనిపోలేదని అరుస్తున్నాను ఎవరు నన్ను చూడట్లేదు. బయటికి పరిగెత్తుకొచ్చాను అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. నా స్నేహితుడితో గొడవపడి నేను ఏడాది నుంచి మాట్లాడలేదు. ఎన్నోసార్లు బతిమిలాడాడు. అయినా మాట్లాడలేదు ఒక్కసారి దేవుడా నన్ను బతికించు కొద్ది రోజులు నాకు సమయం ఇవ్వు ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ ఒత్తిడిలో నా భార్య అని మంచిగా చూసుకోలేదు. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అని చెప్పలేదు నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను నా తల్లిదండ్రుల బాధని చూడలేకపోతున్నాను.
నా స్నేహితుడిని మన్నించమని అడగాలి ఒక్కసారి దేవుడా నన్ను బతికించు.. ప్రాణబిక్ష పెట్టు స్వామి… ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు కళ్ళు తెరిచి వచ్చేసరికి నా భార్య ఏమైంది కలగంటున్నారా..? పిచ్చిపిచ్చిగా అరుస్తున్నారు అని అంది. వెంటనే నా భార్యని పిలిచి నీలాంటి అమ్మాయి భార్యగా దొరకడం నా అదృష్టం. ఒక్కసారిగా నన్ను హత్తుకుని కన్నీళ్ళతో నా భార్య నా వైపు చూసింది. ఒకసారి ఈగోలన్నీ పక్కన పెట్టేసి పక్కన ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి… తల్లిదండ్రులది పిల్లల్ని బాగా చూసుకోండి. స్నేహితులతో బాగా ప్రవర్తించండి జీవించి ఎందరికి ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబాన్ని అయినా ఆనందంగా ఉంచండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!