Advertisement
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బాలయ్య ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి హిట్లు కొట్టేశారు కలెక్షన్ పరంగా ఎన్నో రికార్డులని సృష్టించిన బాలయ్య కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. బాలయ్య సినిమాలు యావరేజ్ అయినా కూడా కలెక్షన్లకి ఎటువంటి లోటు ఉండేది కాదు. బాలయ్య సినిమాను తీసుకున్న బయ్యర్లు నష్టపోవడం అనేది చాలా రేర్ గా ఉండేది. బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి బాలయ్య తర్వాత హీరోగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ అదే జోష్ తో కొనసాగిస్తున్నారు. 1984 లో వచ్చిన సాహసమే జీవితం దర్శకుడు పి వాసు అతని మిత్రుడు కలిసి ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమా తో అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు బాలయ్య. ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇన్ని సినిమాలు చేసిన బాలయ్య కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. బాలయ్య కెరియర్లో ఆగిపోయిన సినిమాలు చూద్దాం… 1986లో జంధ్యాల దర్శకత్వంలో నటరత్న సినిమా చేయాలని బాలయ్య అనుకున్నారు. ఆయన పుట్టిన రోజున టైటిల్ పేపర్లో ప్రకటన కూడా వచ్చింది.
Advertisement
అమెరికాలో షూట్ చేయాలని అనుకున్నారు వీసాలు రావడం ఆలస్యం అవ్వడం, బాలకృష్ణకి డేట్లు అడ్జస్ట్ అవ్వకపోవడం దీంతో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. కథలో మార్పులు చేర్పులు చేసి చిన్ని కృష్ణుడు అనే టైటిల్ ని పెట్టి సినిమాని తీశారు. అలానే త్రీడీ సినిమాలు కొత్తగా వస్తున్న రోజుల్లో ఆ ఫార్మాట్ మీద సినిమా చేయాలని అనుకున్నారు. టైటిల్ శపధమని పెట్టారు. అయితే ఈ సినిమా క్లాప్ కొట్టకుండానే ఆగిపోయింది. అశోక చక్రవర్తి సినిమాని నిర్మించిన కోగంటి హరికృష్ణ బాలకృష్ణుడు అనే సినిమాని అనౌన్స్ చేశారు.
అశోక చక్రవర్తి ధ్రువ నక్షత్రం సినిమాలు కథ ఇంచుమించు ఒకటే. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవడంతో బాలకృష్ణకి కోపం వచ్చి బాలకృష్ణుడు సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణతో భారీ లెవెల్ లో జానపద సినిమాని ప్రారంభించారు. గోపాల్ రెడ్డి సినిమాకి విక్రమ సింహ భూపతి అనే టైటిల్ పెట్టారు. సినిమా షూటింగ్ సగానికి పైగా అయ్యింది బాలకృష్ణ గోపాల్ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి దీంతో అర్దాంతరంగా సినిమా ఆగిపోయింది. నర్తనశాల అనే సినిమాని తీయాలని అనుకున్నారు. కానీ బాలకృష్ణకి యాక్సిడెంట్ అవ్వడం సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో సినిమా ఆగిపోయింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!