Advertisement
అప్పుడప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే డబ్బులు కనబడుతూ ఉంటాయి. ఎవరో డబ్బులు పారేసుకుని ఉండచ్చు. కొంతమంది ఆ డబ్బుల్ని ముట్టుకోకుండా పక్కనుండి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంత మంది ఆ డబ్బులు తీసుకెళ్తుంటారు. అయితే ఈ రెండిట్లో ఏది మంచిది..? రోడ్డు మీద డబ్బులు కనబడితే వాటిని తీసుకోవచ్చ, తీసుకోకూడదా..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది రోడ్డుమీద డబ్బులు కనపడితే ఏం చేయాలి తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు ఎవరైనా డబ్బుల్ని పోగొట్టుకుని ఉండొచ్చు. వాళ్ళు రోడ్డుమీద డబ్బుల్ని పారేసుకుంటూ ఉంటారు ఆ డబ్బుల్ని మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు.
Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు రోడ్డుమీద డబ్బు దొరికితే మీరు చేపట్టిన పని పూర్తవుతుందని దానికి అర్థం. అలా డబ్బులు కనపడితే మీ పని పూర్తయిపోతుందట అంతేకాకుండా అకస్మాత్తుగా రోడ్డు మీద డబ్బులు దొరకడం అదృష్టానికి సంకేతం. రోడ్డుమీద డబ్బులు దొరికితే శుభసంకేతంగా భావించొచ్చు అని జ్యోతిష ని పనులు అంటున్నారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రమోషన్ కూడా వస్తుందట. రోడ్డు మీద డబ్బులు దొరికితే లక్ష్మీదేవి మీ పట్ల సంతోషంగా ఉందని, త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం.
Advertisement
అలానే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట. మీరు అప్పులు కష్టాల నుండి విముక్తి పొందుతారని దీనికి అర్థం. అలానే రోడ్డు మీద డబ్బు దొరకడం వలన ఆ ఇంట్లో శుభం సంతోషం కలుగుతాయి, ఇంటి ఆశీర్వాదాలకి చిహ్నంగా భావిస్తారు. రోడ్డు మీద డబ్బుని తీసుకుని ఆలయానికి ఇచ్చేయడం మంచిది రోడ్డు మీద ఎప్పుడైనా డబ్బులు కనపడితే వాటిని మనం ఇంటికి తెచ్చుకోకూడదు. వాటిని దగ్గరలో ఉండే ఆలయంలో వేసేయడం మంచిది కాబట్టి ఈసారి ఎప్పుడైనా డబ్బులు దొరికితే అది మంచి సూచకంగా భావించాలి దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్లి ఆ డబ్బులు వేసేయాలి ఇదే మంచి పద్ధతిని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!