Advertisement
కొన్ని కొన్ని వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని కచ్చితంగా పాటించే తీరాలి. పిల్లలు స్కూల్ కి వెళ్లే యూనిఫాంలో కూడా రూల్స్ అనేవి ఉంటాయి. అలానే డాక్టర్లు లాయర్లు కూడా రూల్స్ ప్రకారం దుస్తులు వేసుకుంటూ ఉంటారు. మనం గమనించినట్లయితే డాక్టర్లు తెల్ల కోట్లు, లాయర్లు నల్లకోట్లు వేసుకుంటారు ఈ విషయం గురించి చాలామంది ఆరా తీసే ఉంటారు. అసలు ఎందుకు డాక్టర్లు తెల్ల కోట్లు వేసుకుంటారు..? లాయర్లు ఎందుకు నల్లకోట వేసుకోవాలి..? దీని అర్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే చూద్దాం. తెల్లటి రంగు హైజీన్ ని సూచిస్తుంది.
Advertisement
హాస్పిటల్ లో డాక్టర్లు వైద్యులకి వైద్యం చేసే టైంలో బట్టలకి మరకలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. తెల్లటి బట్టలు వేసుకోవడం వలన ఎటువంటి మరకలు అయినా సరే స్పష్టంగా కనబడుతూ ఉంటాయి ఆ మరకల్ని గుర్తించడం ఈజీ అవుతుంది. వెంటనే కోటు మార్చుకోవడానికి లేదంటే ఇన్ఫెక్ట్ అవ్వకుండా క్లీన్ చేయడానికి మరక క్లియర్ గా కనబడుతుంది. ఇలా వెంటనే మరకని చూసి మార్చుకోవడం వలన ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు.
Advertisement
పైగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. హాస్పిటల్ కి వైట్ కోటు తో వెళ్లడం వలన వాళ్ళు డాక్టర్లని మనం గుర్తించొచ్చు. హాస్పిటల్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు తెల్లటి కోటు వేసుకున్న వాళ్ళు డాక్టర్లని మనం ఈజీగా అర్థం చేసుకో వచ్చు. ఇక లాయర్ల విషయానికి వచ్చేస్తే లాయర్లు నలుపు రంగు వేసుకుంటారు. నలుపు రంగు డిగ్నిటీ, హానర్, విస్డం, జస్టిస్ ని సూచిస్తుంది ప్రత్యేకంగా కోర్టు లో లాయర్లని గుర్తించడానికి అవుతుంది ఇలా ఈ కారణాల వల్లనే డాక్టర్లు తెల్ల కోటు, లాయర్లు నల్ల కోటు ని వేసుకుంటారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!