Advertisement
కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ఈమధ్య ఎక్కడ చూసినా ఆమె పేరే వినపడుతోంది. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది కుమారి ఆంటీ. హైదరాబాదులో రోడ్డు పక్క ఉన్న ఫుడ్ బిజినెస్ తో ఆమె ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఎన్నో రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలని తక్కువ ధరకే అమ్ముతూ అందరి ఆకలి తీరుస్తోంది. ఫుడ్ రేటు తక్కువగా ఉండడంతో ఎంతోమంది కుమారి ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళుతున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయడం కోసం రావడం తో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో పోలీసులు ఈమె ని అక్కడి నుండి బిజినెస్ క్లోజ్ చేసి పంపించారు. దీనితో పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది.
Advertisement
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటన మీద స్పందిస్తూ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆమె యధావిధిగా తన బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ కుమారి ఆంటీ బాగా సంపాదిస్తోంది కుమారి ఆంటీ మీద 1000 రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ విపరీతంగా రీల్స్ కూడా చేస్తున్నారు. కుమారి ఆంటీ నెల సంపాదన ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. కుమారి ఆంటీ ఎంత సంపాదిస్తుందనేది చూశారంటే షాక్ అవుతారు.
ఖర్చులు పోను ఒకటిన్నర లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. దీంతో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈమె మధ్యాహ్నం 12:30 నుండి 2 లోపు తన ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేస్తారని కొన్ని గంటల్లోనే భారీ స్థాయిలో సంపాదిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ కి జీవనోపాధి కోసం వచ్చి ఫుడ్ బిజినెస్ నడుపుతూ భారీగా డబ్బులు సంపాదిస్తోంది కుమ్మరి ఆంటీ.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!