Advertisement
టాలీవుడ్ స్టార్ హీరోలలో జగపతిబాబు కూడా ఒకరు. జగపతిబాబు అప్పట్లో చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చి తండ్రిగా విలన్ గా ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నారు.ఆమని కూడా సీనియర్ యాక్టర్. ఆమె కూడా చాలా ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. జంబలకడిపంబ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఆమని. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికీ పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిలకపచ్చ కాపురం, భలే బుల్లోడు, పెళ్లి పీటలు, సర్దుకుపోదాం రండి ఇలా పలు సినిమాల్లో సౌందర్యతో నటించారు.
Advertisement
చాలా సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అందులోనూ వీళ్ళు చాలా క్లోజ్ గా ఉండేవారట వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చేయట. అప్పటికే జగపతిబాబుకి పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయని చెప్పారు. అప్పట్లో సౌందర్య జగపతిబాబు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కదా అని ఒక యాంకర్ అడిగితే, దీని మీద ఆమని షాకింగ్ కామెంట్స్ చూసారు. జగపతిబాబు సౌందర్య మధ్య అటువంటి బంధం ఏమీ లేదు కాకపోతే ఎక్కువ సినిమాలు కలిసి చేయడం వలన అలా వార్తలు వచ్చాయని ఆమని క్లారిటీ ఇచ్చింది.
Advertisement
ముఖ్యంగా సౌందర్య చాలా మంచిదని ఆమెకి కుటుంబం తర్వాతే మిగతా వాళ్ళని చెప్పింది ఆమని. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తనకి ఫోన్ చేసి రమ్మని బాగా ఏడ్చిందట అప్పటిదాకా తండ్రి ఏం చెప్తే అది విన్న సౌందర్య తర్వాత తన అన్నని తండ్రిగా భావించిందని ఆమెని చెప్పారు. అన్న చెప్పాడని ఒక వ్యక్తిని సౌందర్య పెళ్లి చేసుకుందని ఆమని క్లారిటీ ఇచ్చేస్తారు. ఇద్దరూ కన్నడ వాళ్ళం కాబట్టే స్నేహం బాగా కుదిరిందని తనకి పెళ్లి అయిన తర్వాత చాలా సార్లు కలుసుకున్నామని ఆమని చెప్పారు. సౌందర్య చనిపోయిందని తెలిసి కాపాడి ఉంటే బాగుండునని ఆ దేవుడితో మాట్లాడినట్లు కూడా చెప్పారు ఆమని.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!