Advertisement
Moon story in Telugu: చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకించి సోమవారం నాడు శివుడిని (Lord shiva) ఆరాధిస్తూ ఉంటారు. శివుడు నిర్వికారి. ఎక్కడో స్మశానంలో ఆయన ఉంటారు. ఒంటినిండా బూడిద పూసుకునే ఉంటారు. నుదుట మీద విభూతితో పాటుగా అడ్డంగా బొట్టు కూడా ఉంటుంది. జులపాల జుట్టుని ముడి వేసుకుంటారు. అతని మెడలో నాగుపాము ఉంటుంది చేతిలో త్రిశూలం ఢమరుకం ఉంటాయి. పులి చర్మాన్ని వస్త్రంగా ధరిస్తారు. ఇవన్నీ మనకి తెలుసు. అయితే శివుడు శిరస్సు మీద చంద్రవంక ఉంటుంది. ఈ చంద్రవంక ఎందుకు ఉంటుంది శివుడు శిరస్సు మీద చంద్రవంక ఉండడం వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని చూద్దాం.
Advertisement
క్షీరసాగరమదనం చేసే సమయంలో అమృతంతో పాటుగా విషయం కూడా బయటకు వచ్చింది దానిని స్వీకరించినందుకు దేవతలు భయపడ్డారు. అసురులు కూడా అది చూసి భయపడిపోయారు. ఆ విషం సృష్టిని సైతం వినాశనం చేసే సామర్థ్యం వుంది. ఈ ప్రమాదం తెలుసుకుని దేవతలు పరమేశ్వరుని దగ్గరికి వెళ్లి కాపాడమని అంటారు అప్పుడు దేవతల మొర ఆలకించిన శివుడు విషయాన్ని గొంతులో దాచుకున్నారు విష ప్రభావం వలన గొంతు నీలం రంగులోకి మారిపోయింది ఫలితంగా నీలకంఠుడు అనే పేరు స్థిరపడిపోయింది విషం కారణంగా శివుని శరీరం వేడిగా మారిపోయింది. దానిని తగ్గించడానికి చంద్రుడిని తల మీద ఉంచుకోవాలని శివుడిని వేడుకున్నారు దానికి శివుడు అంగీకరించకపోయినప్పటికీ చంద్రుడు తెలుపు రంగు చల్లదనం వలన విష ప్రభావం కొంతవరకు తగ్గుతుందని దేవతలు ఒప్పించారు. శివుడు అందుకు తల ఊపాడు. అప్పటినుండి శివుని శిరస్సు మీద చంద్రుడు కొలువుతీరాడు. చంద్రుడు వలన శివునిపై విష ప్రభావం కొంతమేరకు తగ్గింది.
Advertisement
Also read:
- Chiranjeevi: సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసు వల్లే చిరంజీవి అంతటి స్టార్ హీరో అయ్యారా ! కృష్ణ చేసిన త్యాగం ఏంటంటే..?
- Best husband qualities: భార్య భర్తలో కోరుకునే 5 లక్షణాలు ఇవేనట ! 2వ ది చాలా ముఖ్యం..!
- Renu Desai : రేణు దేశాయి రెండో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?
దక్ష మహారాజుకి 27 మంది కూతుళ్లు వాళ్ళందరినీ అనసూయ కుమారుడైన చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. చంద్రుడు తన కుమార్తెలందరినీ ప్రేమగా చూసుకుంటున్నాడని దక్షుడు భావించాడు. 27 మంది భార్యలు వున్నా వాళ్ళలో ఒక్క రోహిణి మీద మాత్రమే చంద్రుడు ప్రేమ చూపించేవాడు. దీంతో కూతుర్లు అందరూ దక్షుడి దగ్గరికి వెళ్లి బాధని చెప్పుకున్నారు. అప్పుడు దక్షుడు అందరినీ సమానంగా చూసుకోవాలని చెప్తాడు దానికి చంద్రుడు ఒప్పుకోడు ఫలితంగా చంద్రుడిని దక్షుడు శపిస్తాడు. పరమేశ్వరుడికి తపస్సు చేస్తాడు. చంద్రుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శాపం గురించి శివుడికి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోక కళ్యాణం కోసం 15 రోజులు వెలుగుతూ 15 రోజులకు క్షీణిస్తూ ఉండాలని వరం ఇస్తాడు. అలా పౌర్ణమి అమావాస్య ఏర్పడ్డాయి. శంకరుడు చంద్రుడి భక్తికి మెచ్చి శిరస్సు మీద స్థానం ఇచ్చాడని అంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!