Advertisement
Soundarya: నటి సౌందర్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సౌందర్య అందరికీ సుపరిచితమే దాదాపు 10 ఏళ్ల పాటు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది సౌందర్య. ఆమెను చూసిన వాళ్ళందరూ ప్రతి ఇంట్లో అమ్మాయిలా భావించేవారు. ట్యాలెంట్ ని నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చింది తన నటనతో అందరిని ఆకట్టుకుంది. సౌందర్య కెరియర్ పిక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. సౌందర్య 31 ఏళ్లకే చనిపోయారు బిజెపి కోసం ఎన్నికల ప్రచారానికి బెంగళూరు విమానాశ్రయం నుండి కరీంనగర్ కి సౌందర్య రావాల్సి ఉంది.
Advertisement
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపు ప్రచారం చేయడానికి ఆమె బయలుదేరింది అయితే ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ ఇంకో వ్యక్తి ఉన్నారు. విమానం గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడికి వెళ్లి చూస్తే మొత్తం మంటలే కనిపించాయి. విమానంలో ఉన్న ముగ్గురు కూడా బూడిదైపోయారు. సౌందర్య జులై 18,1971న కర్ణాటకలో పుట్టారు. ఆమె పుట్టినప్పుడు ఆమె మరణం త్వరగా సంభవిస్తుందని ఒక జ్యోతిష్యుడు చెప్పారట.
Also read:
Advertisement
Also read:
ఆమె అకాలంగా మరణిస్తుందని ఆ జ్యోతిష్యుడు అన్నారట. సౌందర్య తల్లిదండ్రులు అందుకే నిత్యం పూజలు యాగాలు చేసే వారని ఆమె సన్నిహితులు తెలిపారు. దాదాపు 12 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో స్టార్ హోదా అనుభవించారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ భాషల్లో 100కి పైగా సినిమాలు చేశారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె పేరుని సౌందర్యగా మార్చుకున్నారు. డాక్టర్ కావాలనుకున్న సౌందర్య ఎంబిబిఎస్ లో చేరారు. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరంలో ఉండగానే ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ సినిమాలో నటించడానికి ఛాన్స్ ఇచ్చారు ఇలా నటనల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడంతో చదువుని మధ్యలోనే ఆపేశారు సౌందర్య.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!