Advertisement
పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి గుండెకు తాకిన పవన్ కళ్యాణ్ రొమ్ము విర్చుకుంటూ తన విజయాన్ని అందరికీ ఇచ్చారు. తనతో పాటుగా కూటమిని కూడా విజయ శిఖరాలకు నడిపించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే… పవన్ కళ్యాణ్ ఈరోజు సాధించింది ఏంటి ఆరోజు చిరంజీవి కోల్పోయింది ఏంటి అని.. ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. అన్నను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం యూత్ వింగ్లో యాక్టివ్ గా రాజకీయాలు చేశారు.
Advertisement
అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ కి ఒక స్పష్టమైన తేడా ఉంది. ఎన్టీఆర్ రాజకీయాలను ఆదర్శంగా తీసుకుని చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. సినిమా హిట్ కొట్టినంత ఈజీ కాదు రాజకీయాలంటే. ఈ విషయం త్వరగా చిరంజీవికి అర్థమైంది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త అధ్యయనానికి తెరుస్తూ చిరంజీవి పోటీ చేసిన కూడా కేవలం 22 స్థానాలకే పరిమితమయ్యారు. అయితే ఈ ఓటమి జీర్ణించుకోలేని చిరంజీవి త్వరగా పావులు కదిపారు.
Advertisement
పార్టీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసి ఐదేళ్లపాటు ఒక మినిస్ట్రీ మాత్రమే తీసుకుని తర్వాత పూర్తిగా రాజకీయాలని వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ కి 22 కాదు కదా ఒకే ఒక సీటు మాత్రమే. 2019 ఎన్నికల్లో గెలుచుకున్నారు. కానీ మళ్ళీ ఐదేళ్లపాటు తాను ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు 2024లో ఇది కదా పవన్ కళ్యాణ్ అని అందరికీ అర్థం అయ్యేలా చేశారు. పోటీ చేసిన ప్రతి చోటా గెలిచారు. బాబుతో కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా నడిపించబోతున్నారు. అన్న పార్టీని అమ్ముకుంటే తమ్ముడు మాత్రం ప్రజల్ని నమ్ముకున్నాడు. ఇదే వీళ్ళిద్దరి మధ్య తేడా అని అంతా అంటున్నారు. చిరంజీవి సాధించలేనిది ఈరోజు పవన్ కళ్యాణ్ సాధించి చూపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!