Advertisement
ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ నుండి అతని కుటుంబాన్ని బాయ్ కాట్ చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. కోనేళ్లుగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఫిలింనగర్ లో చర్చ జోరుగా సాగుతోంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్‌తో ఆయన గతంలోలా ఉండట్లేదని మెగా ట్యాగ్ లైన్ నుండి బయట పడాలని సంకేతాలను అల్లు అర్జున్ ఎప్పటినుండో ఇస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ చర్యలపై మెగా పవన్ అభిమానులు ముందు నుండి సీరియస్ గా ఉన్నారు. ఎన్నికల ఎపిసోడ్ తో ఇది తారస్థాయికి చేరుకుంది.
Advertisement
ఎన్నిసార్లు క్షమించినా తీరు మార్చుకోకపోవడంతో మెగా ఫ్యామిలీ బన్నీ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి స్నేహ రెడ్డిని తన ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఖాతాల్లో వారిని అన్ ఫాలో చేయడం దుమారం రేపుతోంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ విజయాన్ని అందుకున్నాక కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారట. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలోని అందరినీ ఆహ్వానించారు. అల్లు ఫ్యామిలీకి ఇన్విటేషన్ వెళ్లలేదని ఫిలింనగర్ లో టాక్. మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని అనధికారికంగా బాయ్ కాట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. శిల్పా రవికి అల్లు అర్జున్ స్నేహితుడని ప్రచారం చేశారు అలాగే మరో కారణం కూడా ఉంది.
Advertisement
అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు నిర్మాత బన్నీ వాసు వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని బన్నీ వాసు గీత ఆర్ట్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు. జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉండే బన్నీ వాసుని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో అనుభవంతో పాటుగా పిఆర్ బలం ఉండడంతో ఆ పదవిని పవన్ ఆయనకు ఇచ్చారు. తనపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు. ఎన్నికల్లో పాలకొల్లు పిఠాపురం లేదా ఉభయగోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గము నుండి పోటీ చేయాలని ఆయన భావించారు.
టికెట్ల కేటాయింపు చేసినప్పుడు ఆయనకి నిరాశ ఎదురయింది. బన్నీ వాసు అల్లు అరవింద్ దృష్టికి తీసుకువెళ్లాగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. చెప్పినట్లే జనసేనానితో ఈ విషయాన్ని మాట్లాడారు. పొత్తులు ఇతర సామాజిక సమీకరణలు కారణంగా టికెట్ కేటాయించలేదని పవన్ చెప్పారు. ఆయన రికమెండ్ చేసినా బన్నీ వాసుకి టికెట్ ఇవ్వకపోవడంతో బన్నీ మనసులో బలంగా నాటుకు పోయిందని అందుకే తన మిత్రుడు వైసీపీ నేత శిల్పా రవి తరపున ప్రచారం చేశాడని గాసిప్స్ విపరీతంగా చక్కెర్లు కొడుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!