Advertisement
ఒకే బడిలో చదువుకున్నారు చిన్ననాటి స్నేహితులు వీళ్ళు. పదవ తరగతి కూడా కలిసి పూర్తి చేసారు. ఉన్నత విద్యను ఒకే చోట అభ్యసించారు. ఇద్దరు లక్ష్యం కూడా ఒకటే. అనుకున్న విధంగా సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు అత్యుత్తమ సర్వీస్ అందించిన వీళ్ళిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ సీట్లో కూర్చున్నారు ఐపీఎస్ అధికారులు ద్వారక తిరుమలరావు, శ్రీనివాస్. గుంటూరుకు చెందిన ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీ, నగరానికి చెందిన శ్రీనివాస్ పాండిచ్చేరి డీజీపీగా ఏడాది నుండి సేవలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదివారు.
Advertisement
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. గుంటూరు నగరానికి చెందిన ద్వారకా తిరుమలరావు తర్వాత సివిల్స్ రాసి 1989లో ఏపీ క్యాడర్ కి ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎస్పీగా సేవలందించారు. విజయవాడ కమిషనర్ గా పనిచేసిన ద్వారకా తిరుమలరావును ప్రస్తుతం DGP పదవి వరించింది. ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు.
Advertisement
Also read:
Also read:
శ్రీనివాస్ కూడా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు తిరుమల రావు తో కలిసి చదువుకున్నారు. 1990లో ఐపీఎస్ గా జమ్మూ కాశ్మీర్ కేడర్ కు ఎంపికయ్యారు. పాండిచ్చేరి డీజీపీ బాధ్యతలు స్వీకరించారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఇప్పటికీ గుంటూరులో చదువుకున్న పాఠశాలకు వస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు డీజీపీలుగా ఎంపిక కావడంతో వారి ఆనందం కి అవధులు లేకుండా పోయాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!