Advertisement
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం, అవినీతి బయటకు వెతికి తీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో టీడీపీ కక్ష సాధింపులకు దిగుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు అంటున్నారు. మైనింగ్, మద్యం, భూకబ్జాలు, ఇసుక ఆక్రమ తవ్వకాలు ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతల కోట్లాది రూపాయలు సంపాదించాలని విమర్శలు వస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అవినీతికి పాల్పడిన వాళ్ళని వదిలిపెట్టమని హెచ్చరించారు.
Advertisement
హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. ఇందులో ఫస్ట్ పేరు రోజాదే ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా జగన్ పై ఈగ వాలనివ్వలేదు. రోజా పదునైన మాటలతో అందర్నీ సైలెంట్ గా ఉంచేది జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
Also read:
నాణేల మీద ఈ ముద్రలు ఎందుకుంటాయి..?
ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదామ ఆంధ్ర, సీఎం కప్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. వంద కోట్ల స్కామ్ జరిగిందని రోజా, మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వస్తున్నాయి. రిషి కొండపై జగన్ ప్రభుత్వం కట్టిన విశాలమైన ప్యాలెస్ విషయంలో కూడా రోజా పేరు వినపడుతోంది. నేడో రేపో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమని ఊహాగానాలు మీడియాలో వినపడుతున్నాయి. రోజా సోదరులు కూడా సెటిల్మెంట్లు చేసేవారని స్థానికులు చెబుతున్నారని, తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదని ఇమంది రామారావు కుండబద్ధలు కొట్టారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!