Advertisement
ఏపీ చరిత్రలో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పింఛన్లు పంపిణీలో రికార్డుని నమోదు చేసింది. ఒక్కరోజులో 95% మేర పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రికార్డ్ ని సృష్టించింది. సోమవారం రాత్రి పది గంటలకల్లా 61.95 లక్షల మందికి పింఛన్ పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు అని ప్రభుత్వ యంత్రాంగానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. మిగిలిన వాళ్ళకి మంగళవారం వారి ఇంటి వద్ద నగదు అందించినున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా కూడా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా పెన్షన్ పంపిణీ జరగలేదట.
Advertisement
Advertisement
వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో 2.65 మంది వాలంటీర్లు ఉన్నా ఒక్కరోజులో పంపిణీ చేసింది కేవలం 88% మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలో అత్యధికంగా 97% పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం జరిగింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 91% పింఛన్ పంపిణీ పూర్తయింది. ఉదయం 6 గంటల నుండి 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేశారు. ఏపీలో పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు నెలకొందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Also read:
ఎప్పుడు లేని విధంగా ఎవరూ చేయలేంది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిందని.. అంతమంది వాలంటీర్లు ఉన్నా కూడా ఎప్పుడు పెన్షన్ పంపిణీ ఇలా జరగలేదని.. 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని వారు అన్నారు. గత ప్రభుత్వం రెండు నెలలపాటు ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆపేస్తుందని వాలంటీర్లు లేకుండా పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఉద్యోగుల కష్టంతో రికార్డు సాధ్యమైంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!