Advertisement
ప్రతి ఒక్కరు కూడా వారిని ఎదుటి వాళ్ళు ఇష్టపడాలని అనుకుంటుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది మాత్రం వాళ్ళని అందరూ ఇష్టపడే విధంగా వాళ్ళ వైపు తిప్పుకుంటుంటారు. అలా మీరు కూడా చేయాలనుకుంటే ఈ లక్షణాలు మీలో ఉండేటట్టు చూసుకోవాలి. మన మాటలు మన చేష్టలు సమాజంలో పేరును తీసుకువస్తాయి. మంచి ప్రవర్తన నలుగురు పట్ల దయ సహాయం చేసే గుణం ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారు. వినడం చాలా ముఖ్యమైనది. ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను ఏకాగ్రతతో ముందు వినాలి. వారు ఇబ్బందుల్ని అర్థం చేసుకొని నవ్వుతూ స్పందించాలి.
Advertisement
అలాగే ఎదుటి వాళ్ళే ఇబ్బందుల్ని చులకనగా చూడకూడదు. వీలైనంతవరకు దయతో ఉండాలి వాళ్ళ కష్టాలను మీరు తీర్చకపోయినా కనీసం అర్థం చేసుకోవాలి. కాస్త ధైర్యం చెప్పాలి. అలాగే నెగిటివ్ గా ఆలోచిస్తే ఎవరికీ నచ్చదు పాజిటివ్ గా ముందుకు వెళ్లాలి. ప్రతి విషయంలో కూడా మంచిని గుర్తించాలి. అలానే మీరు ఎదుట వ్యక్తిని ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు. ఎదుటి వ్యక్తికి ఇచ్చిన ప్రామిస్ ని కూడా నిలబెట్టుకోవాలి. మీ వాగ్దానాలు నిలుపుకునేందుకు వీలైనంత వరకు మీరు పని చేయాలి.
Advertisement
Also read:
అలాగే ఎదుటి వ్యక్తిని పలకరించినప్పుడు వాళ్ళతో కాస్త గౌరవంగా ఉండాలి. ఏకవచనంగా మాట్లాడడం లెక్కచేయకుండా ప్రవర్తించడం మంచి లక్షణం కాదు. టీం వర్క్ లో లేదా ఇతర ఇద్దరి మధ్య సంభాషణలో మీ మాటలు ఎఫెక్ట్ గా ఉండాలి. అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తికి మీపై నమ్మకం ఉంచిన వారికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి దీంతో మీ మీద గౌరవం వాళ్ళకి పెరుగుతుంది. పనిలో, ఇంట్లో ఎక్కడ మీరు ఉన్నా కూడా చుట్టూ వాతావరణం సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. హాస్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలి. ఎదుటి వాళ్ళ మూడుని మార్చాలి అలాంటి మాటలు మాట్లాడాలి. అప్పుడు అందరు మిమ్మల్ని ఇష్టపడతారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!