Advertisement
హిందూ సంప్రదాయంలో ఆషాడ మాసానికి విశిష్టత ఉంది. ఆషాడం మాసం శివుడికి విష్ణువుకి పూజలకు అనుకూలమైన సమయం అని వేద పండితులు అంటున్నారు. ఈ సమయంలో పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందట. ఈ ఆషాడ మాసం లో పుణ్యఫలం మోక్షం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాల గురించి చూద్దాం. ఆషాడ మాసంలో పూజలు పారాయణాలు చేయడం మంచిది. ఉపవాసం, అన్నదానానికి కూడా అనుకూలం. హిందూ సంప్రదాయంలో ఆషాడమాసం శివుడు విష్ణు ఆరాధన ఆరాధనకు ముఖ్యమైనదిగా పరిగణించబడింది.
Advertisement
పేదలకు ఉసిరి, గొడుగు మొదలైన వాటిని దానం చేస్తే పుణ్యం లభిస్తుందట. శక్తి మేరకు ఏదైనా దానం చేస్తే మంచి జరుగుతుందట. ఆషాడ మాసం పూజలకు, ఉపవాసాలకు ఉత్తమమైనది. ఈ నెల నుండి చాతుర్మాస, ఆషాడ గుప్త నవరాత్రులు, యోగినీ ఏకాదశి, గురుపూర్ణిమ వంటి ముఖ్య రోజులు ఉన్నాయి. ఇంట్లో తప్పనిసరిగా యాగం లేదా హవనం చేయాలని పండితులు అంటున్నారు.
Advertisement
Also read:
ఆషాడమాసంలో యాగం చేయడం వలన అన్ని మాసాల కంటే శీగ్ర ఫలితాలు లభిస్తాయి. ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో పితృదేవతల నామస్మరణ చేయాలి. ఇది అదృష్టాన్ని తీసుకు వస్తుంది. జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సుని ఇస్తుంది. ఆషాడ మాసం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెల మొత్తం సాయంత్రం ఇంటికి ఈశాన్యం మూలలో నెయ్యి దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద, ఐశ్వర్యం చేకూరుతాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!