Advertisement
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. ఎంతటి ముఖ్యమైన పనులైనా కూడా వాయిదా వేస్తుంటారు. ముఖ్యంగా వివాహాది కార్యక్రమాల జోలికి అసలు వెళ్లరు. ఈ కాలంలో జగన్నాథుడు రథయాత్ర, తెలంగాణ బోనాలు, తొలి ఏకాదశి వంటి పండగలు ఉంటాయి. మరోవైపు ఈ కాలం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ నెలలో పౌర్ణమి వేళ ఉత్తరాషాఢ నక్షత్రం రావడానికి ఈ మాసానికి ఆషాడమని పేరు వచ్చింది. సూర్యుడు మీద నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో దక్షిణాయన మొదలవుతుంది.
Advertisement
ఈ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు. ఆ తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. శాస్త్రాల ప్రకారం ఆషాడమాసంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి. పెళ్లి వంటి కార్యక్రమాలను అస్సలు చేయరు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా కాపురం చేయకూడదని పుట్టింటికి వెళ్లాలని పెద్దలంటూ ఉంటారు. ఈ నెలలో శాకంబరీ నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Advertisement
Also read:
అంతే కాదు ఆషాడంలో వచ్చే సప్తమిని భాను సప్తమి అంటారు. సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణం దాకా మారుతూ ఉంటాడు. ఈ సమయంలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఆషాడ మాసాన్ని అనారోగ్యం మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో విపరీతమైన ఈదురు గాలులతో వర్షాలు పడతాయి. కాలవల్లో నదుల్లో ప్రవహించే నీరు కలుషితమైపోతుంది. ఈ నీటిని తాగడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి ఆషాడంలో కొత్త నీరు తాగడం వలన చలి జ్వరాలు తలనొప్పి విరోచనాలు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!