Advertisement
కపుల్స్ అందరు కూడా సంతోషంగానే ఉండాలనుకుంటారు. కపుల్స్ సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా కొన్నిటిని పాటించాలి లేదంటే అనవసరంగా వాళ్ళ రిలేషన్ పాడవుతుంది. భార్య భర్తలు ఇద్దరు తనువులు వేరైనా మనసు ఒకటే అన్నట్లు ఉంటారు. దంపతుల మధ్య ఆనందం ఉండాలంటే కచ్చితంగా దంపతులు కొన్ని విషయాలని అలవాటు చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మీరు ఎక్కడ ఉన్నా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా మీ పట్ల సంతోషంగా ఉంటారు.
Advertisement
మీ భాగస్వామి పట్ల గౌరవంగా ఉండండి. వారికి మీ బంధువులు దగ్గర సముచిత స్థానం కల్పించండి. చులకనగా చూడడం అస్సలు మంచిది కాదు. అలానే మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండండి. వారితో మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే కోపం తగ్గించుకోవాలి. భాగస్వామి పట్ల కోపం పెంచుకోవడం మంచిది కాదు. ఒకవేళ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా వెంటనే క్షమాపణ చెప్పి దగ్గర అవ్వాలి. అంతేకానీ సమస్యను పెద్దది చేసుకుంటూ వెళ్ళిపోకూడదు.
Advertisement
Also read:
మీ భాగస్వామిని మెచ్చుకోవడంఅలవాటు చేసుకోవాలి. వారు చేసే పనులను మెచ్చుకోవడం వలన మీ పట్ల గౌరవం పెరుగుతుంది ప్రేమ కూడా పెరుగుతుంది. అలానే మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్లతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. దంపతులు సంతోషంగా ఉండాలంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా పని చేసేటప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రతి జంటకి కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి. వాటిని మీ భాగస్వామితో కలిపి జరుపుకోవాలి. ఈ సందర్భాల్లో వాళ్ళకి సర్ప్రైజ్లు ఇవ్వాలి మంచి బహుమతులు, ఇష్టపడే బహుమతులు కొనివ్వండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!