Advertisement
తొలి ఏకాదశి తో అన్ని పండగలు మొదలవుతాయి. హిందువులకి ఏకాదశి తిధి ప్రత్యేకమైనది. కృష్ణ పక్ష శుక్లపక్ష ఏకాదశి తిధులు విశ్వాసాన్ని పోషించే శ్రీహరికి అంకితం చేస్తారు. కష్టాల నుండి బయట పడడానికి ఈ రోజు ఉపవాసం చేస్తారు. ఏకాదశి వ్రతం చేయడం ద్వారా పోయిన జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయని నమ్ముతారు. దేవశైని ఏకాదశి నాడు ఉపవాసం చేసి అందరూ పరమశివుని ఆరాధిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాడమాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి లేదా దేవశైని ఏకాదశి తిధి జూలై 16న రాత్రి 8:30 గంటలకి మొదలై జూలై 17న బుధవారం రాత్రి 9:02 గంటల దాకా ఉంది.
Advertisement
తొలి ఏకాదశి రోజున తల స్నానం చూసి కొత్త బట్టలు వేసుకోవాలి. విష్ణువు లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటానని దేవుని ముందు ప్రతిజ్ఞ చేయాలి. డబ్బు ధాన్యాలు దానం చేయాలి. విష్ణు కి నైవేద్యంలో తులసి ఆకులను చేర్చాలి.
Advertisement
Also read:
Also read:
ఈరోజున స్త్రీలను అవమానించకూడదు. అలాగే ఈ రోజున తులసి మొక్కల నుండి ఆకులను తొలగించకూడదు. ఉపవాసం చేసే వాళ్ళు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళను ఏమీ అనకూడదు. ఇలా ఏకాదశి నాడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. అప్పుడు ఎంతో మంచి జరుగుతుందట. శివుని అనుగ్రహం కూడా కలిగి సంతోషంగా ఉండొచ్చట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!