Advertisement
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షను తీసుకోవడం వలన అనేక సమస్యల నుండి బయటపడొచ్చు. ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు తో పాటుగా చాలా పోషకాలు ఉంటాయి. అందుకని వీటిని ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎండు ద్రాక్షలో వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే మరీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజులో ఎన్ని తింటే మేలు అనే విషయంలోకి వచ్చేస్తే.. ప్రతిరోజు 40 నుండి 60 గ్రాములు ఎండుద్రాక్షను తీసుకోవచ్చు అంతకుమించి తీసుకోవడం మంచిది కాదు.
Advertisement
సుమారు రోజుకి 10 నుండి 14 తినడం వలన ఎలాంటి నష్టం వాటిల్లదు. ఎండుద్రాక్షలను నానబెట్టుకుని తింటే పోషకాలు మరింత ఎక్కువవుతాయి. రాత్రంతా నీళ్లలో కానీ పాలలో కానీ నానబెట్టుకుని తీసుకుంటే ఉదయాన్నే ఎంతో మేలు కలుగుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్షలను తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Advertisement
Also read:
Also read:
శరీరంలో రక్తం పెరిగిపోకుండా పెరగడానికి తోడ్పడుతుంది. వీటిని రోజు తినడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా వీటితో అనేక ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఎండు ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోండి. ఈ లాభాలని పొందండి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!