Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఫాలో అయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. వాస్తు శాస్త్రంలో గోడ గడియారాలు అదృష్టానికి సంబంధించినవిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో గోడకు గడియారం తగిలించే ముందు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేటట్టు చూసుకోవాలి. గోడ గడియారాన్ని తూర్పు పశ్చిమం ఉత్తరం వైపు ఉన్న గోడకు వేలాడు తీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు తగిలించకండి దీని వలన నష్టాలు వస్తాయి.
Advertisement
అలానే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ తలుపుకు అస్సలు పెట్టకూడదని గుర్తు పెట్టుకోండి. అలా చేయడం వలన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అనవసర వివాదాలు కష్టాలు, నష్టాలు కలుగుతాయి. అలానే వాస్తు ప్రకారం ఆగిపోయిన గడియారాలు విరిగిపోయినవి పగిలిపోయినవి అస్సలు ఇంట్లో ఉండకూడదు. దీని వలన ఎంతో నష్టం ఉంటుంది పైగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి ప్రవహిస్తుంది. సంతోషం కూడా ఆగిపోతుంది.
Advertisement
Also read:
Also read:
గడియారాన్ని ఉత్తరం వైపు పెట్టడం మంచిది దీని వలన సంపద శ్రేయస్సు కలుగుతాయి ఉత్తర దిశ కుబేరుడు వినాయకుడికి దిశగా చెప్తారు. కాబట్టి ఈ వైపు పెట్టొచ్చు. తూర్పు వైపు గడియారం పెడితే ఇంటికి వృద్ధుని ఇవ్వడమే కాదు మీ పనుల్లో నాణ్యతని పెంచుకోవచ్చు. దక్షిణ దిశ గోడకు మాత్రం పెట్టకండి. దక్షిణ స్థిరత్వాన్ని దిక్కు ఈ దిశలో గడియారాన్ని పెట్టడం వలన మీ ఇంటి పురోగతిని నెమ్మదిస్తుంది. దక్షిణ దిశకు యముడు అధిపతి ఈ దిశలో గడియారని పెడితే ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతారు. సమస్యలు పెరిగిపోతాయి. సమస్యలతో ప్రతికూల వాతావరం ఏర్పడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!