Advertisement
చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. పాలు పడట్లేదా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. పాలు పడట్లేదు అని బాధపడొద్దు. పాలు పడకపోతే క్యాల్షియం పుష్కలంగా ఉండే వేరే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. వీటి వలన కాల్షియం అంది సమస్యలు ఉండవు. పాలు తాగకపోయినా ఇబ్బందులు ఉండవు. మనిషి శరీరానికి కాల్షియం చాలా ముఖ్యం. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే పాలు అందరికీ పడవు. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఏ బాధ ఉండదు. క్యాల్షియం నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్లో 88mg క్యాల్షియం లభిస్తుంది.
Advertisement
కాబట్టి నువ్వులను మీరు పాలకు బదులు తీసుకోవచ్చు. చియా సీడ్స్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. రెండు టేబుల్ స్పూన్ల లో 179mg క్యాల్షియం ఉంటుంది. బాదం లో కూడా క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. ఒక కప్పులో 385 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అరకప్పు టోఫులో 800mg క్యాల్షియం ఉంటుంది. అలాగే పొద్దుతిరుగుడు గింజల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పులో 109mg క్యాల్షియంను పొందవచ్చు.
Advertisement
Also read:
Also read:
ఒక కప్పు ఫ్రోజెన్ బ్రోకలీలో 87mg క్యాల్షియం ఉంటుంది. ఇలా వీటితో మీరు క్యాల్షియంని పొందవచ్చు. ఎముకల సమస్యలు మొదలైన సమస్యలు ఏమి కూడా ఉండవు. ఆరోగ్యంగా ఉండవచ్చు. పాలు పడకపోతే పాలకు బదులు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.
ఆరోగ్య చిట్కాలు కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!