Advertisement
చాలామంది కావాల్సినంత డబ్బులు సంపాదించలేకపోతుంటారు. కొంతమంది డబ్బులు సంపాదిస్తారు కానీ వృధాగా ఖర్చు చేసేస్తూ ఉంటారు. నెల జీతం అందుకున్న వారంలోనే మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు వాస్తు దోషాలు ఉన్నాయేమో చూసుకుంటారు. ఇలా కనుక పాటించారంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫలితంగా సంపద వృద్ధి చెందుతుంది. డబ్బు కూడా బాగా సంపాదించగలుగుతారు.
Advertisement
పురాణాల ప్రకారం తాబేలును విష్ణుమూర్తికి ప్రత్యేకగా భావిస్తారు. దశావతారాల్లో కూర్మ అవతారం కూడా ఒకటి. తాబేలు ఎంతో చక్కగా పనిచేస్తుంది. మీ ఇంట్లో వెండి లేదా బంగారు పూత పూసిన తాబేలు పెట్టుకోండి. దీన్ని లాకర్లో లేదా బీరువాలో పెట్టుకుంటే మంచిది ఉత్తర దిశలో పెట్టుకోవచ్చు. సంపదను ఇది ఆకర్షిస్తుంది. డబ్బులు కూడా వచ్చే విధంగా చూస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉండవు. అలాగే వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండడం చాలా మంచిది. దీన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ బొమ్మని ఇంట్లో పెట్టడం వలన శ్రేయస్సు కలుగుతుంది.
Advertisement
Also read:
దీన్ని గిఫ్ట్ గా పొంది మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలని అంటారు కానీ అది నిజం కాదు ఎలా అయినా సరే దీనిని పెట్టుకోవచ్చు. ఇది ఇంట్లో ఉండడం వలన సంపద కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నెల నెల మంచిగా ఆదాయం పొందవచ్చు డబ్బు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది చేపల తొట్టి ఇంట్లో ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. బాగా డబ్బులు సంపాదించడానికి అవుతుంది. అలాగే మనీ ప్లాంట్ ని కూడా ఇంట్లో పెట్టుకోండి. ఇది కూడా డబ్బుల్ని బాగా ఆకర్షిస్తుంది. మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు వీటిని ఫాలో అయిపోండి ఆర్థిక బాధల నుండి బయట పడండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!