Advertisement
టీడీపీ, జనసేన, బీజేపీ ఓటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు దానిపైనే పూర్తి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఢిల్లీ ఒకసారి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు. తాజాగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.
Advertisement
Advertisement
కొద్దిసేపటి కిందట రాష్ట్రపతి భవన్ లో కల్చరల్ సెంటర్ కి చంద్రబాబునాయుడు చేరుకున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ఇక్కడ జరగనున్న జరుగుతున్నే పద్యంలో అక్కడకు చేరుకున్నారు చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ అధ్యక్షతన జరుగుతుంది. కల్చరల్ భవన్ కు వచ్చి చేరుకుంటున్న సమయంలో కారులోనే కొన్ని డాక్యుమెంట్లను అధ్యయనం చేస్తూ కనిపించారు.
Also read:
హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబుతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఏపీ వ్యాప్తంగా అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు కేటాయింపు గురించి చర్చించబోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!