Advertisement
హైదరాబాద్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తనిఖీల్లో రెస్టారెంట్ల నిర్వాకం బయటపడింది. టాస్క్ ఫోర్స్ బృందం రెండు రోజులుగా కొండాపూర్ ప్రాంతంలో తనిఖీలు జరిపింది. హైటెక్ సిటీ లోని ఎక్సోటిక రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు. స్టోర్ రూమ్స్ లో బొద్దింకలు తిరగడాన్ని గుర్తించారు. ఎగ్జాటికలో మాంసం నిలువ చేయడానికి వాడిన ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ ప్రాంగణంలో ఐఎఫ్ఎస్సి లైసెన్స్ ఒరిజినల్ కాపీని ప్రదర్శించారు. అలాగే ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్ నెట్లు యూనిఫామ్ ధరించి ఉన్నట్లు రిఫ్రిజిరేటర్ లోపల నిల్వచేసిన ఆహార పదార్థాలు ప్యాకింగ్లలో ఉన్న వాటిపై తయారీ తేదీలు లేవని వారు గుర్తించారు.
Advertisement
Advertisement
కూరగాయలు కోసే ప్రదేశంలో మూతలు లేకుండా డస్ట్ బిన్స్ కనపడ్డాయని ఫుడ్ హాండ్లర్ల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని అన్నారు. హైటెక్ సిటీ లో ఉన్న మింగ్ ఉస్తాద్ రెస్టారెంట్లో ఎఫ్ఎస్ఎస్ ఏఐ లైసెన్స్ అసలు రెస్టారెంట్ ప్రాంగణంలో చూపించలేదు పుట్టగొడుగులు, కసూరి మేతి గడువు ముగిసిపోయినట్లు గుర్తించారు.
Also read:
ఫుడ్ హ్యాండ్లర్లో కొందరు హెయిర్ నెట్స్ ధరించకుండా ఉండడాన్ని గుర్తించారు రిఫ్రిజిరేటర్ లోపల నిల్వ చేసిన ప్రాసెస్ ఆహార పదార్థాలు గడువు తేదీల వారీగా భద్రపరచులేదు డస్ట్ బిన్లు మూతలు లేకుండా తెరిచి ఉన్నాయని పేర్కొన్నారు. హైటెక్ పరిసరాల్లో నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లలో అపరిశుభ్రమైన వాతావరణం ఫోటోలు వీడియోలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!