Advertisement
Shivam Bhaje Review: హీరో అశ్విన్ ఒక కొత్త పాయింట్‌తో ప్రయోగం చేస్తుంటాడు. కొన్ని సార్లు క్లిక్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సార్లు మాత్రం విఫలం అవుతుంది. ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండటం ప్రతీ మూవీకి కూడా కామన్. ఈ సారి అశ్విన్ శివం భజే తో మన ముందుకు వచ్చాడు. అప్సర్ రాసుకున్న కొత్త పాయింట్‌తో అశ్విన్ చేసిన ఈ మూవీ కథ, రివ్యూ అండ్ రేటింగ్ గురించి చూసేద్దాం.
Advertisement
సినిమా: శివం భజే
నటులు:అశ్విన్ బాబు,దిగంగనా సూర్యవంశీ,అర్భాజ్ ఖాన్
దర్శకుడు:అప్సర్
రిలీజ్ డేట్: 02-08-2024
కథ మరియు వివరణ:
ముందుగా కథ విషయానికి వచ్చేస్తే.. చంద్రశేఖర్ అలియాస్ చందు (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. శైలజ (దిగంగన) ని తొలిచూపులో చూసి ఇష్టపడతాడు. బైనరీ కెమికల్స్ కంపెనీలో ఆమె పనిచేస్తుంది. ఈ కంపెనీలో ఆ కంపెనీకి చెందిన సాగర్ మల్లికార్జున రాధాకృష్ణలు హత్యకు గురవుతారు కేసుల్ని చేదించడానికి ఏసీబీ మురళి రంగంలోకి దిగుతాడు. ఇంకోవైపు చైనా పాకిస్తాన్, ఇండియా మీద ఆపరేషన్ లామాను ప్రయోగించడానికి రెడీ అవుతుంటారు. వీటికి లింక్ ఏంటి..? ఈ కథలో శివయ్య చేసిన లీల ఏంటి..? చివరికి చందు ఏం చేస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ.
చందు పాత్రలో అశ్విన్ చాలా బాగా నటించాడు. నిజానికి అదరగొట్టేసాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్ లో ఉంటుంది రెండో పార్ట్ విషయానికి వస్తే ఇంకో స్టైల్ లో ఉంటుంది. యాక్షన్ కామెడీ ఇలా ప్రతి యాంగిల్ లో అశ్విన్ అందర్నీ మెప్పించేసాడు. మాస్ క్యారెక్టర్ ఆయనకు కొత్త కాదు. అలాగే హీరోయిన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఈ సినిమాలో నటించిన మిగిలిన వాళ్లు కూడా వారి పాత్రకు తగ్గట్టుగా నటించారు. మధ్యమధ్యలో హైపర్ ఆది, షకలక శంకర్ వంటి వాళ్ళు బాగా నవ్వించారు. శివం భజే టీజర్ ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది అని ఒక అంచనా అయితే అందరికీ వచ్చేస్తుంది. ట్రైలర్ ని చూసిన కథలో ఉన్న డివోషనల్ టచ్ అర్థమవుతుంది.
Advertisement
Also read:
శివయ్య ఏదో లీల చేస్తాడని అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అప్సర తీసుకున్న మెయిన్ పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఆ పాయింట్ మీద ఎవరు సినిమాని తీయలేరు. యూనిక్ గా ఉండే పాయింట్ రివీల్ చేయడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఒకసారి ఆడియన్స్ షాక్ అయిపోతారు. ప్రతి సీన్ అసలు ఊహకు అందని విధంగా ఉంటుంది మిస్టరీ సస్పెన్స్ చూసే ఆడియన్స్ కి ట్విస్ట్ ఏంటో ముందే అర్థమవుతుంది. పెట్స్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని అంశాలను కలగలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కథని రూపొందించారు. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. వికాస్ కొట్టిన ఆర్ఆర్ మోతాదుని మించినాటు అనిపిస్తుంది. పాటలు అంతగా గుర్తుండిపోయాయి. మాటలు కొన్నిచోట్ల ఆకట్టుకుంటాయి. మొత్తానికి శివం భజే ఒక వినూత్న ప్రయత్నం అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
హీరో నటన
పాటలు
కొత్త కాన్సెప్ట్
ట్విస్టులు
మైనస్ పాయింట్స్:
బోరింగ్ సీన్స్
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!