Advertisement
చాలామంది ఆన్లైన్లో ఆహార పదార్థాలని ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఆన్లైన్లో ఫుడ్ చాలా ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. అదే ఆహారాన్ని రెస్టారెంట్స్ తక్కువ ధరకి పొందవచ్చు అన్న విషయం కస్టమర్లకి తెలియక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. జొమాటో, స్విగ్గి ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆహారం చాలా ఎక్కువ ధరకి అమ్ముతున్నారని ఇప్పుడిప్పుడే కస్టమర్లకు తెలుస్తోంది. ఈ యాప్స్ సర్వీస్ ఛార్జీలు ప్లాట్ఫార్మ్ చార్జీలు వంటివి జోడించడం వలన రెస్టారెంట్ మెనూలో ఉన్న ధర కంటే కూడా యాప్ లో ఉన్న ధర ఎక్కువగా ఉంటుంది. ఒక కస్టమర్ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత వచ్చిన బిల్లుని ఆన్లైన్లో ఉన్న ధరతో పోల్చి చూపారు. ఈ ధరలు తేడా చూసి చాలామంది షాక్ అయ్యారు.
Advertisement
Advertisement
ముంబైలోని వైల్ పార్లే లో ఉన్న ఉడిపి టు ముంబై అనే రెస్టారెంట్లో భోజనం చేసిన అభిషేక్ కొఠారి అనే జర్నలిస్ట్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. సోషల్ మీడియా వేదికగా దానిని పోస్ట్ చేశారు. బిల్లును కూడా ప్రూఫ్ గా చూపించారు. అభిషేక్ రెస్టారెంట్ లో సౌత్ ఇండియన్ ఫుడ్ తిన్నారు. రెస్టారెంట్లో దోసె ధర 42 కాగా జొమాటో యాప్ లో ధర 120 గా ఉంది.
Also read:
తట్టె ఇడ్లీ రెస్టారెంట్లో 60 రూపాయలు ఉంటే జొమాటోలో 161 రూపాయలు అమ్ముతున్నారు రెస్టారెంట్ కంటే జొమాటో ఆహారం చాలా ఎక్కువగా ఉంది. రెస్టారెంట్స్ లో తింటే బిల్లు 325 అయింది. జొమాటో లో అయితే 740 చెల్లించాల్సి వచ్చింది. రెస్టారెంట్లో ఉప్మా నలభై రూపాయలు ఉంటే జొమాటోలు 120 రూపాయలు గా ఉంది ఇలా ధరల విషయంలో చాలా తేడా ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!