Advertisement
అప్పుడప్పుడు మనం పాము కరిచింది వింటూ ఉంటాం కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కూడా. పాము కనబడితే చాలా మంది భయపడతారు. పాము కాటు వేస్తే ఇక పరిస్థితి వర్ణించలేము. పాము కాటు వేస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా..? పాము కాటుకు గురైన వ్యక్తిని కాపాడడానికి నోటితో విషాన్ని తీయడం, కొన్ని సార్లు రాళ్లతో కాటు వేసిన చోట రుద్దడం, మూలిక మందులు పసరు వైద్యాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఇవి ప్రమాదం. అయితే పాము కాటు వేస్తే ఏం చేయాలి అని దాని గురించి చూద్దాం. సాధారణంగా పాము కాటు వేస్తే బాధితులు పడే ఆందోళన మామూలుగా ఉండదు.
Advertisement
ప్రాణం పోతుందేమో అన్న భయంతో ఒత్తిడికి లోనవుతారు. అన్ని పాములు విషపూరితము కాదు. పాము కాటు వేస్తుందని నిర్ధారణ అయినప్పుడు బాధితుడు కాటు వేసింది ఏ పాము అనేది గుర్తించాడో లేదో ముందు తెలుసుకోవాలి. అది విషపూరితం కాకపోతే ఆందోళన పడక్కర్లేదు. ఒకవేళ విషపూరితమైన పాము కాటు వేస్తే ఆందోళన చెందకుండా ప్రధమ చికిత్స చేసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంజక్షన్లు ఉంటాయి.
Advertisement
Also read:
ప్రథమ చికిత్స ఎలా చేయాలి అనే దాని గురించి చూస్తే.. ముందు బాధితులని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలి. పాము కరిచిన భాగంలో ఉంగరాలు ఆభరణాలు ఉంటే తీసేయాలి లేదంటే వాపు వస్తుంది. పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండేలా చూసుకోవాలి. అటు ఇటు కదలనివ్వకూడదు. స్ట్రక్చర్ లేదా వాహనాల్లో సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇంజక్షన్లు వేయించడం ఇతర వైద్య చికిత్సల ద్వారా ప్రాణాలని కాపాడొచ్చు. ఇలా పాము కాటు వేసిన వారి ప్రాణాలని కాపాడొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!