Advertisement
కొలంబో వేదికగా రెండవ వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మొదటి వన్డేను టై గా ముగించిన శ్రీలంక రెండవ వన్డేలో మాత్రం 32 పరుగులు తేడాతో భారత్ ని ఓడించింది. అయితే తొలి వన్డేలో ఎలా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ వెలవిలాడిందో అలాగే రెండో వన్డేలో కూడా జరిగింది. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే వరకు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. లక్ష్యాన్ని టీం ఇండియా సునయసకంగా చేదిస్తుందని అందరూ భావించారు.
Advertisement
కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జఫ్ఫ్రీ వండర్సే తలకిందులు చేసేసారు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఓడించాడు. 13 ఓవర్లో రోహిత్ శర్మను అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టి తర్వాత కోహ్లీ, శివం దుబెలను వరుసగా అవుట్ చేశారు. 10 ఓవర్ల బౌలింగ్లో 33 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లను సాధించాడు.
Advertisement
Also read:
ఇంతకీ ఇతను ఎవరు అనే విషయానికి వచ్చేస్తే.. 34 ఏళ్ల వండర్సే 2017 లో న్యూజిలాండ్ పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి 34 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు 9 ఏళ్ల కెరియర్ లో ఇప్పటి దాకా అతను 22 వన్డేలు మాత్రమే ఇప్పటివరకు ఓవరాల్ గా 37 మ్యాచ్లలో శ్రీలంక తరపున ఆడాడు 22 వన్డేలు 14 T20 లు ఒక టెస్ట్ మ్యాచ్ అతను ఆడాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!