Advertisement
చాలామంది మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అయితే రాత్రిపూట ఆహారం విషయంలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. రాత్రి పూట చాలామంది అన్నం లేదా చపాతీలలో ఏది తీసుకోవాలి అని ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఏది తీసుకుంటే మంచిది..? దేని వలన ప్రయోజనాలను పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట రైస్ కి బదులుగా చపాతీలు తింటే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. బరువును కంట్రోల్లో చేసుకోవడానికి, బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచడానికి ఎక్కువగా రాత్రి పూట రైస్ కి బదులుగా చాలా మంది చపాతి తింటూ ఉంటారు.
Advertisement
Advertisement
బరువు నియంత్రించేందుకు ఉన్నట్టుండి రాత్రి వేళల్లో వైట్ రైస్ మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు అంటున్నారు. డైట్ లో భాగంగా ఒక పూట రైస్ మానేయడం కంటే అన్నం తక్కువ తీసుకోవడం మంచిది. రాత్రిపూట వేడివేడిగా చపాతీలు తీసుకోవడం కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ వేడిగా తీసుకుంటే నూనె తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.
Also read:
రాత్రి పూట నిల్వ ఉంచిన చపాతీలు తినాలని.. అలా తింటే బీపీ తగ్గుతుందని అల్సర్, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తింటే ఎంతో మంచిది. ఈసారి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చపాతీలు తీసుకోండి అప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!