Advertisement
నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుండి వార్తల్లోకి ఎక్కుతున్నారు. వీరి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆగస్టు 8న చైతు శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు తర్వాత వేణు స్వామి వారిద్దరికీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందనే దాని గురించి చెప్పారు. పెళ్లి తర్వాత అమ్మాయి కారణంగా చైతు శోభిత విడిపోతారని ఆయన బాంబు పేల్చారు. దాంతో ఆయన జాతకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది మహిళ కమిషన్ ఫిర్యాదు నేపథ్యంలో వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి పలు విషయాలని ప్రస్తావించారు. ఘాటుగా స్పందించి కొన్ని అంశాలపై మీడియా తీరుని ప్రశ్నించారు.
Advertisement
వేణు స్వామి పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడంపై వాణి తీవ్రంగా స్పందించారు. నేను వేణు స్వామి భార్యగా వీడియో చేయట్లేదు అనేక సంవత్సరాలుగా మీడియాలో పనిచేసిన జర్నలిస్టుగా స్పందించాలని అనుకుంటున్నాను. నాతోటి సహ జర్నలిస్టు నాకు ఒక మెసేజ్ ని పంపించారు. నాగచైతన్య శోభిత నిశ్చితార్థంపై వీడియో చేసిన వేణు స్వామి పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారని మెసేజ్ లో తెలిపారని అన్నారు. సోషల్ మీడియాలో జ్యోతిష్యులని ఎంకరేజ్ చేసింది ఎవరు మీరు కాదా..? ఎవరైనా ప్రముఖుడు హాస్పిటల్లో చేరితే ఉంటాడా పోతాడా.. క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇండియా గెలుస్తుందా లేదా అని ఇలా డిబేట్లు పెడుతూ ఉంటారు.
Advertisement
Also read:
ఇలాంటి డిబేట్స్ వేణు స్వామి లేకపోతే జరగవు. టీవీ రేటింగ్స్ కోసం వేణు స్వామి కావాల్సి వచ్చిందా వాళ్లకు అని గట్టిగా నిలదీశారు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను ఉద్దేశించి వాణి వీడియో చేశారు. నిశ్చితార్థం చేసుకున్న మీకు కంగ్రాట్స్ మీరు ఇద్దరు క్షేమంగా సుఖంగా ఉండాలని దీవించారు. తుంటిని కొడితే పళ్ళుడిపోయినట్లు మీ ఎంగేజ్మెంట్ న్యూస్ ని డైవర్ట్ చేస్తూ యూత్ వేరే వాళ్ళను టార్గెట్ చేయడం నచ్చలేదంటూ ఆమె వీడియోలో చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!