Advertisement
చిరంజీవి పుట్టినరోజు వేడుకలను దేశ విదేశాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో విదేశాల్లో ఉన్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్డే వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ మెగాస్టార్ చిరంజీవికి షాక్ ఇచ్చింది గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఆ తర్వాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
Advertisement
తెలుగు రాష్ట్రాలు విడిపోవడం ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పూర్తిగా దూరం అయిపోయారు. గత పది ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
మోదీ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడంతో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమయ్యారని అందరూ అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ హై కమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!