Advertisement
మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ రూపొందించగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సమర్పిస్తున్నారు. ప్రత్యేక అతిథులుగా వచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ వేడుకలో వారి మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మై డియర్ ఫాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యు అంటూ అభిమానులు అంటే నాకు పిచ్చి అని అన్నారు.
Advertisement
నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను. గత మూడు ఏళ్లుగా సినిమా విడుదల కాలేదు. కానీ నా అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు అని అన్నారు. వారి ప్రేమే నాకు స్ఫూర్తి అనే నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఇక నుంచి ఎక్కువ సినిమాలతో మీ ముందుకు వస్తానని ఆయన అన్నారు. అల్లు అర్జున్ ప్రత్యేకంగా సుకుమార్ భార్య తబిత గురించి మాట్లాడుతూ.. ఆమె పిలవగానే నేను వచ్చానని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాను ప్రెజెంట్ చేయడం గర్వంగా ఉందని అన్నారు. పుష్ప టు క్లైమాక్స్ షూట్ మధ్యలో ఉన్నామని, ఇప్పటిదాకా నేను చేసిన అత్యంత కఠినమైన క్లైమాక్స్ ఇది అని అన్నారు.
Advertisement
Also read:
సుకుమార్ మీరు కాకపోతే నా సినిమా ఈవెంట్ కు ఇంకెవరు వస్తారు అని ఆమె చెప్పింది. ఇష్టమైన వారికి సపోర్ట్ ఇవ్వడం, వారి పిలుపు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం నాకు ఆనందం ఇస్తుందని అన్నారు. పుష్ప టు మూవీ షూటింగ్ సమయంలో గొడవ జరిగిందని బన్నీ సుకుమార్ అస్సలు మాట్లాడుకోవడం లేదని చాలా రకాల వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరూ ఈవెంట్లు ఎప్పటిలానే స్నేహంగా కనిపించడంతో ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!