Advertisement
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనికుంటుంటారు. భార్యాభర్త పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకుంటే జీవితాంతం హాయిగా ఉండొచ్చు. మీ భార్య ఆనందంగా ఉందో లేదో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా తెలుసుకోవచ్చు. డబ్బులు ఉన్నా కూడా చాలామంది భార్యాభర్తల మధ్య బంధం బాగోదు పైగా ఆర్థికంగా సెటిల్ అయినా కూడా చాలామంది భార్య ఆనందాన్ని పట్టించుకోరు. అయితే భార్య ఆనందం చాలా ముఖ్యమని మీరు గుర్తుపెట్టుకోండి.
Advertisement
మీ భార్యతో నిజాయితీగా మాట్లాడండి ఆమె ఎలా భావిస్తుందో తెలుసుకోవడానికి ఆమెను కొన్ని ప్రశ్నలు అడగండి. ఆమెకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆమెతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ భార్య మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఆమె ఏం చెప్పాలనుకుంటుందో మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మాట్లాడాలి. ఆమె మాటను ఆపేయకుండా, ఆ మాటలు దాటేయకుండా, ఆమెను విమర్శించకుండా అర్థం చేసుకుంటూ మాట్లాడండి. ఆమె నవ్వుతోందా కళ్ళు ఎలా ఉన్నాయి? ఆమె శరీర సడలి ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి.
Advertisement
Also read:
ఆమె బాధగా ఉంటే ముఖం ముడుచుకుంటుంది. కంటి నుండి నీళ్లు కారుతాయి. ఆమె శరీరం గట్టిగా ఉంటుంది. మీ భార్యకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదో తెలుసుకోవాలి. చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ఆమెను ప్రశంసించండి. ఆమెకు కృతజ్ఞతలు తెలపండి. మీ భార్యతో కలిసి సమయాన్ని గడపండి. ఇలా మీరు ఆమె గురించి తెలుసుకుంటూ ఆమెను సంతోషంగా ఉంచండి. ఆమె మీతో సంతోషంగా లేకపోతే ఆమె జీవితం కూడా సంతోషంగా లేనట్లే కాబట్టి భర్త భార్యని కచ్చితంగా అర్థం చేసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి